కొవిడ్‌ బాధిత చిన్నారులకు ఆర్థిక సహాయం

ABN , First Publish Date - 2021-06-19T05:53:42+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ బారిన పడి తల్లి లేదా తండ్రి మృతిచెందిన 18 ఏళ్లలోపు బాలబాలికలకు నెలకు రూ.500 చొప్పున ఆర్థికసాయాన్ని వారి బ్యాంకు ఖాతాలో జమచేస్తామని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎన్‌.సీతామహాలక్ష్మి తెలిపారు.

కొవిడ్‌ బాధిత చిన్నారులకు ఆర్థిక సహాయం
సమావేశంలో మాట్లాడుతున్న ఐసీడీఎస్‌ పీడీ సీతామహాలక్ష్మి

ఐసీడీఎస్‌ పీడీ సీతామహాలక్ష్మి 

ఎంవీపీ కాలనీ, జూన్‌ 18: జిల్లాలో కొవిడ్‌ బారిన పడి తల్లి లేదా తండ్రి మృతిచెందిన 18 ఏళ్లలోపు  బాలబాలికలకు నెలకు రూ.500 చొప్పున ఆర్థికసాయాన్ని వారి బ్యాంకు ఖాతాలో జమచేస్తామని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎన్‌.సీతామహాలక్ష్మి తెలిపారు. ఎంవీపీ కాలనీలోని ఐసీడీఎస్‌ పీడీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన స్పాన్సర్‌షిప్‌ అప్రూవల్‌ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కొవిడ్‌తో తల్లిదండ్రులు మరణించి అనాధలైన వారికి  రూ.10లక్షలు చొప్పున ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు చనిపోతే ఒక్కొక్కరికి నెలకు రూ.500 చొప్పున వారి ఖాతాలో జమచేస్తామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 491 మంది బాలబాలికలను గుర్తించి స్పాన్సర్‌షిప్‌ కమిటీ ద్వారా అప్రూవల్‌ చేశామన్నారు. పిల్లలకు మానసిక ధైర్యాన్నందించి, అవసరమైన వారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నట్లు ఆమె వివరించారు. సమావేశంలో శ్యామలరాణి, సత్యనారాయణ, మమత, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-06-19T05:53:42+05:30 IST