ఇంజనీరింగ్‌ విద్యార్థిని వైద్యానికి

ABN , First Publish Date - 2022-05-26T04:18:21+05:30 IST

అనారోగ్యానికి గురైన ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థిని వైద్య ఖర్చుల కోసం కావలికి చెందిన సేవియర్స్‌ వలంటరీ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో రూ.1,40,000 ఆర్థిక సాయమందించి మానవత్వం చాటుకున్నారు.

ఇంజనీరింగ్‌ విద్యార్థిని వైద్యానికి
చెంగయ్యకు నగదు అందజేస్తున్న సేవియర్స్‌ సంస్థ సభ్యులు

రూ.1.40 లక్షల ఆర్థిక సాయం

కావలిటౌన్‌, మే 25: అనారోగ్యానికి గురైన ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థిని వైద్య ఖర్చుల కోసం కావలికి చెందిన సేవియర్స్‌ వలంటరీ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో రూ.1,40,000 ఆర్థిక సాయమందించి మానవత్వం చాటుకున్నారు. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్‌లోని ఎన్‌బీకేఆర్‌ కళాశాలలో బీటెక్‌ మూడోవ సంవత్సరం చదువుతున్న కోటకు చెందిన శిరీషకు తలలో రక్తం గడ్డకట్టి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆమెకు వైద్యం కోసం పది లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని వైద్యులు నిర్ధారించినట్లు శిరీష తల్లితండ్రులు సేవియర్స్‌ సంస్థ దృష్టికి తెచ్చారు. స్పందించిన సంస్థ సభ్యులు (విద్యార్థులు) రూ.1,40,000 సేకరించి బుధవారం విద్యార్థిని తండ్రి చెంగయ్యకు అందజేశారు. తన కుమార్తె వైద్య ఖర్యుల కోసం ఆర్థిక సాయం అందించిన సేవియర్స్‌ సభ్యులకు చెంగయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు రమణ్‌, రాజేష్‌, మురళి, రేవంత్‌, అభి పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-26T04:18:21+05:30 IST