ఆర్థిక సహాయాలు...

ABN , First Publish Date - 2020-03-29T11:06:07+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రముఖ సినీ దర్శకుడు బి.సుకుమార్‌ మట్టపర్రు గ్రామానికి రూ.5లక్షల విరాళం అందజేశారు.

ఆర్థిక సహాయాలు...

సుకుమార్‌ రూ.5లక్షలు విరాళం

గ్రామానికి దర్శకుడు ఆర్థికసాయం

మట్టపర్రులో ఇంటింటికీ రూ.1000 అందజేత


మలికిపురం, మార్చి 28: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రముఖ సినీ దర్శకుడు బి.సుకుమార్‌ మట్టపర్రు గ్రామానికి రూ.5లక్షల విరాళం అందజేశారు. బి.సుకుమార్‌ స్వగ్రామం మలికిపురం మండలం మట్టపర్రు. ఆయన తన కుటుంబసభ్యులు ద్వారా గ్రామంలో రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.1000 చొప్పున శనివారం అందజేశారు. సుకుమార్‌ తెలుగు రాష్ర్టాలకు ఇప్పటికే రూ.10లక్షలు అందజేశారు. కార్యక్రమంలో సుకుమార్‌ సోదరుడు విజయ్‌, బి.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-03-29T11:06:07+05:30 IST