క్రిప్టో పన్నులకు తగ్గింపులు, సెట్ ఆఫ్‌లు లేవు: ఆర్థిక మంత్రిత్వ శాఖ

ABN , First Publish Date - 2022-03-21T23:02:11+05:30 IST

క్రిప్టో పన్నులకు సంబంధించి ఎటువంటి తగ్గింపులు కానీ, సెట్ ఆఫ్‌లు కానీ అందుబాటులో లేవని ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభ సమావేశంలో స్పష్టం చేశారు.

క్రిప్టో పన్నులకు తగ్గింపులు, సెట్ ఆఫ్‌లు లేవు: ఆర్థిక మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీ : క్రిప్టో పన్నులకు సంబంధించి ఎటువంటి తగ్గింపులు కానీ, సెట్ ఆఫ్‌లు కానీ అందుబాటులో లేవని ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభ సమావేశంలో స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ కార్తీ పి చిదంబరం భారత్ లోని క్రిప్టోకరెన్సీల స్థితి, ప్రత్యేకించి దాని చట్టపరమైన హోదాపై వేసిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. క్రిప్టో కరెన్సీల మైనింగ్ సమయంలో జరిగే మౌలిక సదుపాయాల ఖర్చులను సముపార్జన ఖర్చుగా పరిగణించవచ్చా ? అన్న విషయమై కూడా కాంగ్రెస్ ఎంపీ స్పష్టత కోరారు. ఇక... వర్చువల్ డిజిటల్ ఆస్తులను బదిలీ చేయడం వల్ల కలిగే నష్టాన్ని ఇతర వర్య్చు వల్ డిజిటల్ ఆస్తుల నుండి వచ్చే లాభాలతో భర్తీ చేయవచ్చా ? అన్న విషయమై కూడా చిదంబరం స్పష్టత కోరారు. వర్చువల్ డిజిటల్ ఆస్తుల బదిలీ వల్ల కలిగే నష్టాన్ని ఇతర ఆదాయాలకు వ్యతిరేకంగా సెట్ చేయలేమని పేర్కొనడం గమనార్హం. కాగా... 


చౌదరి ప్రతిస్పందిస్తూ...భారత్‌లో క్రిప్టోకరెన్సీలను నియంత్రించడంలేదని పేర్కొన్నారు. ఇక... క్రిప్టోకరెన్సీలపై పన్నుల విషయంలో ఎలాంటి తగ్గింపులు, లేదా... సెట్ ఆఫ్‌లకు అనుమతి ఉండబోదని స్పష్టం చేశారు. ఫైనాన్స్ బిల్లు 2022 ను పేర్కొంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. క్రిప్టోకరెన్సీలు, వర్చువల్ డిజిటల్ ఆస్తుల విషయానికొస్తే... భారత్ కొంత కఠినమైన వైఖరిని తీసుకుందని ఎత్తి పేర్కొనడం గమనార్హం. అంతేకాకుండా... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... క్రిప్టో ఆస్తుల విషయమై పలుమార్లు ఆందోళనలను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-03-21T23:02:11+05:30 IST