Abn logo
Oct 27 2021 @ 00:09AM

ఫైనాన్స్‌ కంపెనీ ఉద్యోగి దారుణహత్య

 ఎటపాక, అక్టోబరు 26 :  భద్రాచలం పట్టణంలోని ఓ ప్రముఖ టూవీలర్‌ ఫైనాన్స్‌ కంపెనీలో అసిస్టెంట్‌ మేనే జర్‌గా పనిచేస్తున్న ఎటపాక మండలం పురు షోత్తపట్నం గ్రామానికి చెందిన పరుచూరి రఘు (35) హత్యకు గురయ్యాడు. విస్సాపురం- మాధవరావుపేట గ్రామాల మధ్యలో ప్రధాన రహదారి పక్కన అతని మృత దేహాన్ని గుర్తించారు. పురుషోత్తపట్నానికి చెందిన రఘు గత ఆరేళ్లుగా భద్రాచలం పట్టణంలోని ఓ ప్రముఖ టూవీలర్‌ కంపెనీలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.  సోమవారం రాత్రి ఇంటి నుంచి రఘు బయటకు వచ్చాడు. తర్వాత ఏమైందో తెలియదు కానీ రఘు విస్సాపురం- మాధవరావుపేట గ్రామాల మధ్యలో రహదారి పక్కన హత్యకు గురయ్యాడు. సీఐ గజేంద్రకుమార్‌, ఎస్‌ఐ సాగర్‌ సంఘటన స్థలానికి చేరుకుని రఘు మృతదేహాన్ని పరిశీలించారు. మెడ, తల భాగాల్లో మొత్తం 15 కత్తిపోట్లను గుర్తించారు. సోమవారం అర్ధరాత్రి దుండగులు రఘుని హత్యచేసి ఈ ప్రాంతంలో పడేసినట్లు తెలుస్తోంది. రఘు హత్యకు వివాహేతర సంబంధం కారణమా? లేక ఆర్థిక లావాదేవీలు కారణామా? అనేది తెలియాల్సి ఉంది. రఘు మరో ఇద్దరితో కలిసి భద్రాచలం పట్టణంలో సెకండ్‌ హ్యాండ్‌ మోటారుసైకిల్‌ ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నాడు. అతనికి ఓ మహిళతో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రఘు మృతదేహంపై దుం డగులు ఓ లేఖ ఉంచారు. ఫైౖనాన్స్‌ పేరుతో అమాయక గిరిజన మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ప్రజా కోర్టులో శిక్షించామని లేఖలో పేర్కొన్నారు.