ఎట్టకేలకు అక్రమ కట్టడాల కూల్చివేత

ABN , First Publish Date - 2022-01-20T06:15:29+05:30 IST

మునుగోడు మేజర్‌ గ్రామపంచాయతీ కేంద్రంలోని చిట్యాల, నార్కట్‌పల్లి రహదారిని ఆక్రమించి ని ర్మించిన అక్రమ కట్టడాలను పోలీసుల బందోబస్తు నడుమ బుధవారం కూల్చివేశారు.

ఎట్టకేలకు అక్రమ కట్టడాల కూల్చివేత
మునుగోడులో అక్రమ కట్టడాల కూలివేస్తున్న అధికారులు

మునుగోడు, జనవరి 19: మునుగోడు మేజర్‌ గ్రామపంచాయతీ కేంద్రంలోని చిట్యాల, నార్కట్‌పల్లి రహదారిని ఆక్రమించి ని ర్మించిన అక్రమ కట్టడాలను పోలీసుల బందోబస్తు నడుమ బుధవారం కూల్చివేశారు. ఈ కట్టడాలపై 2017 నుంచి ఇప్పటి వరకు స్థానికులు వేర్వేరుగా పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ మే రకు ఇటీవల పంచాయతీ పాలకవర్గం సైతం ఏకగ్రీవ తీర్మానాలు చేసింది. ఉన్నతాధికారులు విచారణ నిర్వహించి అక్రమ కట్టడాలు నిజమేనని తేలాయి. ఈ నివేదికల ఆధారంగా అంతర్గత రహదారితో పాటు డ్రైనేజీని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను వెంటనే కూల్చివేయాలని కలెక్టర్‌ ప్రశాంత జీవనపాటిల్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో బుధవారం కూల్చివేత పనులు ప్రారంభించారు.  ప్రధాన రహదారులకు ఇరువైపులా చిరువ్యాపారాలు సాగించే తో పుడు బండ్లు, పానషాపు డబ్బాలను సైతం తొలగించారు.  పనుల కు ఎలాంటి అవాంతరాలు జరగకుండా డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి ప ర్యవేక్షణలో నల్లగొండ మహిళా పోలీ్‌సస్టేషన సీఐ ఆదిరెడ్డి, రిజర్వ్‌ సీఐ హరిబాబు, ఎస్‌ఐ సతీ్‌షరెడ్డి నేతృత్వంలో 60 మంది పోలీసు సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో మండ ల పంచాయతీ అధికారి కుంభం సుమలతరెడ్డి, పంచాయతీ కార్యదర్శి సుందర మురళీమోహన తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T06:15:29+05:30 IST