ఎట్టకేలకు కదిలారు..!

ABN , First Publish Date - 2021-06-21T04:31:18+05:30 IST

మూడు కొండల మధ్యలో కేరశింగి, గూడ, పోగడవల్లి, గిరిజన గ్రామాలున్నాయి.

ఎట్టకేలకు కదిలారు..!
కొండపై ఉన్న గిరిజనులకు వ్యాక్సిన్‌ వేస్తున్న సిబ్బంది

 వ్యాక్సినేషన్‌కు అంగీకరించిన గిరిజనులు

 మూడు గ్రామాల్లో 80 మందికి టీకా ఫ  ఫలించిన సిబ్బంది కృషి

 మెళియాపుట్టి, జూన్‌ 20: మూడు కొండల మధ్యలో  కేరశింగి, గూడ, పోగడవల్లి, గిరిజన గ్రామాలున్నాయి. ‘మాకు కరోనా రాదు.. వ్యాక్సిన్‌ వేయించుకుంటే మరణిస్తాం’ అన్న అపోహతో ఈ గ్రామాల గిరిజనులు ఇంతవరకు వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ఆసక్తి చూపలేదు. కొన్నిరోజులుగా సచివాలయం, వైద్య సిబ్బంది గ్రామాలకు వెళ్లి అవగాహన కల్పించినా ప్రయోజనం కనిపించలేదు. గతం లో రెండు పర్యాయాలు గ్రామాలకు సిబ్బంది వెళ్లగా, గిరిజనులు ఇళ్లకు తాళాలు వేసి పోడు వ్యవసాయానికి వెళ్లిపోయారు. దీంతో సిబ్బంది వెనుదిరగాల్సి వచ్చింది. అయితే ఆదివారం కొవిడ్‌ వ్యాక్సిన్‌ స్పెషల్‌ డ్రైవ్‌పై ముందస్తు సమాచారం ఇవ్వకుండా కేరశింగి సచివాలయ అధికారుల బృందం నడక దారిలో తెల్లారేసరికి గ్రామాలకు చేరుకున్నారు. గ్రామసభ ఏర్పాటు చేసి కొవిడ్‌ లక్షణాలు, నివారణ మార్గాలను సిబ్బంది వివరించారు. తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని, కరోనా సోకితే వైద్యం అందక మరణించే ప్రమాదం ఉందని అవగాహన కల్పించారు. దీంతో ఎట్టకేలకు గిరిజనులు వ్యాక్సిన్‌ వేసుకునేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో మూడు గ్రామాల్లో మొత్తం 80మందికి వ్యాక్సిన్‌ వేశారు. సిబ్బంది కృషి ఫలించడంతో అధికారులు వారిని అభినందించారు. కార్యక్రమంలో వీఆర్వో శ్యామ్‌, కార్యదర్శి వన జాక్షి, ఏఎన్‌ఎం ఎస్‌.సంతోషి, సంపత్‌కుమార్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-06-21T04:31:18+05:30 IST