ఎట్టకేలకు లాభాల్లోకి..

ABN , First Publish Date - 2022-05-17T06:13:47+05:30 IST

ఆరు సెషన్ల తర్వాత దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం స్వల్ప లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 180.22 పాయింట్ల లాభంతో 52,973.84 దగ్గర క్లోజవగా నిప్టీ 60.15 పాయింట్ల స్వల్ప లాభంతో 15,842.30 వద్ద ముగిసింది.

ఎట్టకేలకు లాభాల్లోకి..

180 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌

ముంబై : ఆరు సెషన్ల తర్వాత దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సోమవారం స్వల్ప లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 180.22 పాయింట్ల లాభంతో 52,973.84 దగ్గర క్లోజవగా నిప్టీ 60.15 పాయింట్ల స్వల్ప లాభంతో 15,842.30 వద్ద ముగిసింది. అయితే ఇంట్రాడేలో సెన్సెక్స్‌ తీవ్ర ఆటుపోట్లకు లోనైంది. ఒక దశలో 634 పాయింట్ల లాభంతో 53,428.28 పాయింట్లను తాకిన సెన్సెక్స్‌.. అమ్మకాల ఒత్తిడితో 800 పాయింట్లకు పైగా నష్టపోయి 52,632.48 పాయింట్లతో ఇంట్రాడే కనిష్ఠ స్థాయిని తాకింది. ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లు అంతంత మాత్రంగా ఉన్నా, ఆటో, బ్యాంకింగ్‌, పవర్‌ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లను లాభాల వైపు నడిపించాయి. అదానీ గ్రూప్‌ టేకోవర్‌తో ఏసీసీ, అంబుజా సిమెంట్‌ షేర్లకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది.  


నేడే ఎల్‌ఐసీ షేర్ల లిస్టింగ్‌ 

ఎల్‌ఐసీ షేర్లు మంగళవారం బీఎ్‌సఈ, ఎన్‌ఎ్‌సఈల్లో లిస్ట్‌ కాబోతున్నాయి. రూ.949 అప్పర్‌ ప్రైస్‌ బ్యాండ్‌తో జారీ చేసిన ఈ షేర్లు పాలసీదారులకు రూ.889, రిటైల్‌ మదుపరులకు రూ.904 చొప్పున కేటాయించారు. సంస్థాగత మదుపరులు మాత్రం ఒక్కో షేరుకు రూ.949 చొప్పున చెల్లించారు.

 ఇష్యూ ముగిసే వరకు గ్రే మార్కెట్లో రూ.100 ప్రీమియంతో ట్రేడైన ఎల్‌ఐసీ షేర్లు ఇప్పుడు రూ.25 నష్టంతో ట్రేడువుతున్నాయి. దీంతో మంగళవారం ఈ షేర్లు నష్టాలతోనే లిస్టవుతాయని మార్కెట్‌ వర్గాల అంచనా.  

Updated Date - 2022-05-17T06:13:47+05:30 IST