నుడాకు తుది మెరుగులు

ABN , First Publish Date - 2022-01-20T06:46:47+05:30 IST

నల్లగొండ నియోజకవ ర్గ సమగ్రాభివృద్ధికి అడుగులు పడుతున్నాయి.

నుడాకు తుది మెరుగులు
పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరిస్తున్న అధికారి

 ప్లాన్‌ ఏబీసీలుగా ప్రణాళిక రూపకల్పన

10 ఎకరాలలోపు లేఅవుట్లకు నుడాలోనే అనుమతులు 

 రోడ్ల విస్తరణకు రూట్‌ మ్యాప్‌ 

పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌లో సమగ్రంగా వివరించిన అధికారులు

నల్లగొండ టౌన్‌, జనవరి 19: నల్లగొండ నియోజకవ ర్గ సమగ్రాభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ముఖ్యమం త్రి కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలను కలుపుతూ నుడా (నల్లగొండ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ )గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అందు కు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ వరుసగా నల్లగొండలో పర్యటించి అభివృద్ధి నమూనాలు రూపొందించారు. అందుకు కొనసాగింపుగా బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో విద్యుత్‌ శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. నుడా ఏర్పాటుతో త్వరితగతిన నియోజకవర్గ అభివృద్ధికి ఏరకంగా ప్రణాళికలు రూపొందించుకోవచ్చో అన్న దానిపై మునిసిపల్‌ కమిషనర్‌ రమణాచారి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. మాస్టర్‌ ప్లాన్‌లోకి ఎం పిక చేసిన 25 గ్రామాలను, విస్తీర్ణతను, ప్లాన్‌ ఏ, బీ,సీలు గా వర్గీకరించి చూపించారు. అదేవిధంగా రోడ్ల విస్తరణకు రూపొందించిన రూట్‌మ్యా్‌పతో పాటు పట్టణంలో రోడ్ల విస్తరణ అనంతరం జరిగే అభివృద్ధిని వివరించారు. అనంతరం ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌తోపాటు కళాభారతి స్టేడియం, అర్బన్‌ పార్కులు, వెండర్‌జోన్లు, శిల్పారామాల ఏర్పాటుపై విశ్లేషించారు. అధికారులు, ఏజెన్సీలు రూపొందించిన ప్లాన్‌ ఏ,బీ, సీలను సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత కొన్ని సవరిస్తూ ప్లాన్‌డీ రూపొందించాలంటూ మంత్రి పలు సూ చనలుచేశారు. అంతేకాకుండా పెరుగుతున్న పట్టణానికి అనుగుణంగా జరుగుతున్న అభివృద్ధి ఉండాలన్నది ప్రభు త్వ సంకల్పమని, అధికారులు రూపొందించే ప్రణాళికలు ఆ సంకల్పానికి అనుకూలంగా ఉండాలని తెలిపారు. నుడా ఏర్పాటుతో ఇకపై 10 ఎకరాల వరకు ఏర్పాటు చేసే వెంచర్లకు అనుమతులు కూడా నుడా పరిధిలోనే ఉంటాయని అధికారులు వివరించారు. గ్రామాలు నుడాలో కలిసినప్పటికీ ఇళ్ల నిర్మాణ అనుమతులు మాత్రం గ్రామపంచాయతీలకు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. సుమారు రెండున్నర గంటలకు పైగా జరిగిన సమీక్షా సమావేశంలో నుడా ఏర్పాటు, నుడాలో కలవనున్న గ్రామాలు, భవిష్యత్‌లో ఏర్పాటు చేయనున్న నిర్మాణాలు, రోడ్ల విస్తరణ.. మొత్తంగా నల్లగొండ సుందరీకరణకు తీసుకోనున్న చర్యలపై సమగ్రంగా చర్చించారు. సమావేశంలో కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఎస్పీ రెమా రాజేశ్వరి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిషోర్‌కుమార్‌, చిరుమర్తి లింగయ్య. భాస్కర్‌రావు, మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ అపూర్వచౌహాన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T06:46:47+05:30 IST