ఫొటో ఓటర్ల తుది జాబితా విడుదల

ABN , First Publish Date - 2021-01-16T07:02:24+05:30 IST

ఓటర్ల ఫొటోతో కూడిన తుది జాబితాను జిల్లా ఎన్నికల సం ఘం శుక్రవారం విడుదల చేసింది.

ఫొటో ఓటర్ల తుది జాబితా విడుదల

పురుషులు 16,16,175 - మహిళలు 16,53,146 


చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 15: ఓటర్ల ఫొటోతో కూడిన తుది జాబితాను జిల్లా ఎన్నికల సం ఘం శుక్రవారం విడుదల చేసింది. మొత్తం ఓటర్లు.. 32,69,677 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 16,16,175 మంది, మహిళలు 16,53,146 మంది, ఇతరులు 356 మంది. పురుషుల కంటే మహిళా ఓటర్లు 36,971 మంది ఎక్కువగా ఉన్నారు. చంద్రగిరిలో అత్యధికంగా 2,98,128 మంది, తర్వాతి స్థానంలో తిరుపతిలో 2,80,351 మంది, చిత్తూరులో అత్యల్పంగా 2,00,020మంది ఓటర్లున్నారు. పురుష ఓటర్లు కుప్పం, జీడీ నెల్లూరు నియోజకవర్గాల్లో అధి కం కాగా.. మిగిలిన 12 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. జిల్లా ఎన్నికల సంఘం గత నవంబరు 16న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించింది. అప్పట్లో ఓటర్లు 32,43,516 మంది ఉండగా, ఇపుడు 26,161 మందిపెరిగారు. ఇతరుల ఓటర్లలో మార్పు లేదు. 


నియోజకవర్గాల వారీగా ఓటర్లు

నియోజకవర్గం మొత్తం     పురుషులు       మహిళలు             ఇతరులు

తంబళ్లపల్లె        214822        106984        107825            13

పీలేరు               229400         113731          115661        08

మదనపల్లె        254976        126021        128893            62

పుంగనూరు        235710        116613        119077            20

చంద్రగిరి        298128        145860        152214            54

తిరుపతి        280351        139385            140918            48

శ్రీకాళహస్తి        244824         118678         126120            26

సత్యవేడు        209884        102422            107445            17

నగరి            202637            99244            103386            07

జీడీ నెల్లూరు        202891         101516        101362            13

చిత్తూరు        200020            98301            101675            44

పూతలపట్టు        217757         107931        109808            18

పలమనేరు        259768            129259        130505            04

కుప్పం            218509            110230           108257            22

Updated Date - 2021-01-16T07:02:24+05:30 IST