Abn logo
May 28 2020 @ 08:35AM

సైకిల్ గర్ల్ జ్యోతి... బ‌యోపిక్‌కు స‌న్నాహాలు!

Kaakateeya

దర్భాంగా: బాలీవుడ్‌ చిత్రనిర్మాత వినోద్ కప్రి బీహార్‌కు చెందిన‌ సైకిల్ గర్ల్ జ్యోతిపై సినిమా చేయబోతున్నారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో జ్యోతి అనారోగ్యంతోవున్న తండ్రినిసైకిల్‌పై  కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్లు ప్ర‌యాణించి త‌మ ఇంటికి తీసుకువ‌చ్చింది. ఈ విధంగా వారు గురుగ్రామ్ నుంచి ద‌ర్బంగాకు చేరుకున్నారు. ఈ నేప‌ధ్యంలో జ్యోతి కుమారి దేశ‌వ్యాప్తంగా అంద‌రి ప్రశంసలు అందుకుంటోంది. జ్యోతి ఏడు రోజుల్లో త‌న గ‌మ్యాన్ని చేరుకుంది.  ఆమె క‌థ‌ను విన్న బలీవుడ్ నిర్మాత వినోద్ కప్రి సైకిల్ గ‌ర్ల్ జ్యోతిపై సినిమా చేయబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా వినోద్ కప్రి మాట్లాడుతూ తాను ప్రస్తుతం కాలినడకనన‌, సైకిల్‌పై వెళ్లే వ‌ల‌స కార్మికులపై షార్ట్ ఫిల్మ్‌లు తీస్తున్నాన‌న్నారు. ఇప్పుడు  జ్యోతి క‌థాంశంతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాన‌ని తెలిపారు. ఇందుకోసం తాను ఆమె తండ్రితో కూడా మాట్లాడాన‌ని పేర్కొన్నారు. జ్యోతి నేడు లక్షలాది మంది అమ్మాయిలకు ప్రేరణ అని, అందుకే సినిమా తీయాల‌నుకుంటున్నాన‌ని వినోద్ కప్రి తెలిపారు. 


Advertisement
Advertisement
Advertisement