May 28 2021 @ 21:39PM

చాలా మిస్‌ అవుతున్న నిత్యా... బ్లడీ గాడ్జియస్‌ ప్రియా!

సినీతారల సోషల్‌ టాక్‌

భర్త గౌతమ్‌ కిచ్లూతో కలిసి లాక్‌డౌన్‌ సమయాన్ని ఆస్వాదిస్తోంది టాలీవుడ్‌ మిత్రవింద కాజల్‌ అగర్వాల్‌. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోల్ని అభిమానులతో పంచుకున్నారు. ఇలా చాలామంది తారలు నెటిజన్లను ఆకట్టుకున్నారు. వాటిపై ఓ లుక్కేద్దాం. 


1. ఫ్రెండ్స్‌తో ఫన్‌ టైమ్‌ను మిస్‌ అవుతున్నా అంటున్నారు నిత్య మీనన్‌. తన ఫ్రెండ్స్‌తో కాఫీ తాగుతున్న పాత ఫొటో ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. 


2. ‘సర్దార్‌ కా గ్రాండ్‌ సన్‌’ సినిమాలోని ఓ పాటకు సంబంధించిన పోస్టర్‌ను షేర్‌ చేశారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. రాత్రి 12 గంటల సమయం... లైట్‌.. కెమెరా... యాక్షన్‌ అనడాన్ని ఎవరూ ఆపలేరు’’ అని ఆమె పేర్కొన్నారు. 


3. రోజూ హాట్‌ హాట్‌ ఫొటోలతో అలరించే సీరత్‌కపూర్‌ ఈరోజు చక్కగా బొట్టు, చీర కట్టుకుని సంప్రదాయంగా కనిపించారు. 


4. వారానికి రెండు డాన్స్‌ వీడియోలతో అలరిస్తుంది జాతిరత్నాలు ఫేం  ఫరియా అబ్దుల్లా. ఈ రోజు కూడా ఆమె పోస్ట్‌ చేసిన డాన్స్‌ ఈడియో వైరల్‌ అయింది. 


5. భూమికా చావ్లా గత జ్ఞాపకాల్లోకి వెళ్లారు. 2018లో దిగిన తన ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. 


6. బీచ్‌లో కొబ్బరి బొండాలు లెక్క పెడుతున్నా అంటూ ఓ స్టిల్‌ పోస్ట్‌ చేశారు శాలినీ పాండే! 


7. ఐ యామ్‌ నాట్‌ బ్యూటీఫుల్‌... ఐ యామ్‌ బ్లడీ గాడ్జియస్‌ అంటూ రీల్స్‌ చేశారు మలయాళ బ్యూటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. 


8. కొన్ని  జీబ్రాల ఫొటోలను పంచుకుని.. ఇవి నల్ల చారలతో తెల్లగా ఉన్నాయా? తెల్ల చారలతో నల్లగా ఉన్నాయా?అని అడుగుతోంది అదా శర్మ. 


9. కంఫర్ట్‌గా ఉన్న దుస్తులు, ఫుట్‌వేర్‌ అంటేనే నాకిష్టం అంటున్నారు గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా.