కొవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌ కోసం...

ABN , First Publish Date - 2021-05-09T05:30:00+05:30 IST

కొవిడ్‌-19 బాధితుల సహాయార్థం ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించే వర్చువల్‌ ఫండ్‌ రైజర్‌ కార్యక్రమంలో పాల్గొనడానికి భారతీయ చిత్ర పరిశ్రమ ప్రముఖులు ముందుకొచ్చారు...

కొవిడ్‌ రిలీఫ్‌ ఫండ్‌ కోసం...

కొవిడ్‌-19 బాధితుల సహాయార్థం ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించే వర్చువల్‌ ఫండ్‌ రైజర్‌ కార్యక్రమంలో పాల్గొనడానికి భారతీయ చిత్ర పరిశ్రమ ప్రముఖులు ముందుకొచ్చారు. ఆదివారం సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకూ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యుట్యూబ్‌లో ‘ఐ బ్రీత్‌ ఫర్‌ ఇండియా’ సంస్థ లైవ్‌ కార్యక్రమం నిర్వహించనుంది. ఇందులో దక్షిణాది నుంచి రానా దగ్గుబాటి, సమంత... ఉత్తరాది నుంచి అమితాబ్‌ బచ్చన్‌, శేఖర్‌ కపూర్‌, అనిల్‌ కపూర్‌, కరణ్‌ జోహార్‌, కృతీ సనన్‌, అభిషేక్‌ బచ్చన్‌, రితేశ్‌-జెనీలియా దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దీనికి లారా దత్తా, షయమల్‌ వల్లభ్‌జీ వాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. సినీ ప్రముఖులు కాకుండా క్రికెటర్లు శిఖర్‌ ధావన్‌, రవిచంద్ర అశ్విన్‌, రిషబ్‌ పంత్‌తో పాటు శ్రీశ్రీ రవిశంకర్‌ తదితరులు సైతం పాల్గొంటారని కరణ్‌ జోహార్‌ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సమీకరించిన నిధులను కరోనా బాధితులకు అందజేస్తామనీ, వచ్చిన డబ్బుకు అంతే మొత్తాన్ని తమతో భాగస్వాములైన దాతలు ఇవ్వనున్నారని ఆయన పేర్కొన్నారు. సుమారు రూ. 10 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. నటుడు సోనూ సూద్‌, అక్షయ్‌కుమార్‌, ట్వింకిల్‌ ఖన్నా తదితరులు కరోనా బాధితులకు సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే.


Updated Date - 2021-05-09T05:30:00+05:30 IST