హిమాచల్‌లో రూ.100 కోట్లతో ఫిల్మ్ సిటీ నిర్మాణం

ABN , First Publish Date - 2021-09-06T15:27:01+05:30 IST

హిమాచల్ ప్రభుత్వం అభివృద్ధి దిశగా...

హిమాచల్‌లో రూ.100 కోట్లతో ఫిల్మ్ సిటీ నిర్మాణం

సిమ్లా: హిమాచల్ ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. హిమాచల్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ పారిశ్రామిక రంగాలలో రూ.3,307 కోట్ల పెట్టుబడుల కోసం మొత్తం 27 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఫలితంగా రాష్ట్రంలోని సుమారు 15 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కలగనుంది. పితారా టీవీ రాష్ట్రంలో ఫిల్మ్ సిటీ ఏర్పాటు కోసం రూ.100 కోట్ల విలువైన భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసింది. 


రాష్ట్రంలో రూ. 1000 కోట్ల వ్యయంతో ఇథనాల్ ఉత్పత్తి కోసం మొత్తం 6 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ట్రైడెంట్ కంపెనీ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు కోసం 800 కోట్ల రూపాయల విలువైన ఎంఓయూపై సంతకం చేసింది. బెటర్ టుమారో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం రూ. 490 కోట్ల విలువైన భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసింది. మాధవ్ ఆగ్రో ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్, హిమాలయన్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్‌లు సంయుక్తంగా తొలి నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం రూ. 400 కోట్ల విలువైన ఎంఓయూలపై సంతకం చేశాయి.

Updated Date - 2021-09-06T15:27:01+05:30 IST