Jun 7 2021 @ 21:19PM

హీటెక్కిస్తున్న శ్రియ.. పరవశంలో పరిణీతి!

సినీ సెలబ్రిటీల సోషల్‌ మీడియా ముచ్చట్లు!


బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ ‘ది లెజెండ్‌ ఆఫ్‌ భగత్‌సింగ్‌’ చిత్రంలో నటించి నేటితో 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలోని ఓ ఫొటోను షేర్‌ చేసి భగత్‌సింగ్‌ పాత్రలో తన ఫొటోను పంచుకున్నారు. 


1. తనకు నచ్చిన స్కర్ట్‌ ధరించి కంఫర్ట్‌గా ఉందని చెబుతున్నారు శ్రియాశరన్‌.


2. ఈరోజు సోమవారం అయినప్పటికీ ఆదివారం తాలూక బద్దకం ఇంకా పోలేదు. చిల్‌ అవ్వడం చాలా అవసరం అంటున్నారు నదియా. 


3. ‘కొన్ని పాత్రలు మనల్ని వాస్తవంలోకి తీసుకెళ్తాయి. ప్రస్తుతం నేను అదే స్థితిలో ఉన్నా. ప్రశాంతంగా నిద్ర పడుతుంది’’ అంటున్నారు పరిణీతి చోప్రా. 


4. షూటింగ్‌ కోసం ఎదురుచూస్తున్నా అంటూ కెమెరా పట్టుకుని కనిపించారు ఆది.


5. బ్లూ డ్రెస్‌ ధరించి చిరు నవ్వుతో ఫొటో పంచుకున్నారు ప్రగ్యా జైస్వాల్‌.


6. సమస్యల్లో ఉన్నప్పుడు కళ్లు మూసుకుని ప్రశాంతంగా ఉంటే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది’’ అని సోనాల్‌ చౌహాన్‌ అన్నారు. 


7. నేను బీచ్‌ దగ్గర నివసించాలనుకుంటున్నాను అంటున్నారు హంసా నందిని. సాగరతీరాన రాత్రి సమయంలో సరదాగా నడవాలని, అలల శబ్దం వినాలనుందని  బీచ్‌ దగ్గర దిగిన ఫొటోల్ని పంచుకుంది.