Jun 5 2021 @ 21:40PM

పర్యావరణం మన బాధ్యత: సినీతారలు

సినీ సెలబ్రిటీల సోషల్‌ మీడియా టాక్‌!

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పలువురు సినీ తారలు మొక్కలు నాటి సోషల్‌ మీడియా వేదికగా పర్యావరణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌, రకుల్‌, రాశీఖన్నా, లావణ్య త్రిపాఠీ, జాన్వీ కపూర్‌, సారా అలీఖాన్‌, జగపతిబాబు తదితరులు పర్యావరణం గురించి మాట్లాడారు. 


1. తమన్‌ చిన్నప్పుడు డ్రమ్స్‌ వాయిస్తున్న ఫొటోను పంచుకున్నాడు. ఇవే నా నా నేస్తం అని పేర్కొన్నారు. 


2. ఎకో ఫ్రెండ్లీ లైఫ్‌ స్టైల్‌ను అలవరచుకోండి అంటున్నారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌. 


3. పూజాహెగ్డే వండర్‌ ఉమెన్‌లా మారి సంభాషిస్తున్నారు.


4. సోనూసూద్‌ తాను ముంబయిలో మోడలింగ్‌ చేేస నాటి ఫొటోలను పంచుకున్నారు.


5. బిగ్‌బాస్‌ ఫేం కౌశల్‌ మొక్కను నాటి పర్యావరణాన్ని రక్షించడం మన బాధ్యత అని అన్నారు. 


6. పర్యావరణంతో స్వేచ్ఛ ప్రశాంతత ఉందంటోంది రాశీఖన్నా. 


7. ప్రశాంత వాతావరణంలో మెడిటేషన్‌ చేస్తూ కనిపించారు అజయ్‌ దేవగణ్‌.