Aug 22 2021 @ 00:00AM

సమంత కొత్త లుక్‌.. చిరు శుభాకాంక్షలు!


సినీ సెలబ్రిటీల సోషల్‌ మీడియా ముచ్చట్లు

సోషల్‌ మీడియా చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలతో హోరెత్తిపోయింది. చిరుకి శుభాకాంక్షల వర్షం కురిసింది. మరో పక్క రాఖీ పండుగ సెలబ్రేషన్స్‌ జోరుగా జరిగాయి. ఆ విశేషాలు...


1. చిరంజీవి, సోనూసూద్‌, వరుణ్‌తేజ్‌, సాయితేజ్‌, నాని, విశ్వక్సేన్‌, జెనీలియా, కంగనా రనౌత్‌, ప్రీతి జింటా తదితరులు రాఖీని ఘనంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. 


2. తన మిత్రులతో కలిసి అల్లరి చేశారు నటి శ్రద్థాదాస్‌. దానికి సంబంధించిన వీడియో షేర్‌ చేశారు. 


3. తన తన కొత్త ఫొటోని షేర్‌ చేసింది నాయిక సమంత. 


4. కోన వెంకట్‌కు రాఖీ కట్టారు సింగర్‌ సునీత.


5. కియారా  అడ్వాణీ తన కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు.


6. తేజస్‌ షూటింగ్‌లో రాఖీ పండుగ జరుపుకొన్నారు కంగనారనౌత్‌.