Jul 22 2021 @ 18:45PM

ప్రిన్సెస్‌ తమన్నా... కేథరిన్‌ కామెంట్‌!

సోషల్‌ మీడియా టాక్‌

సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా సందడి చేశారు. మీనా, రోజా లాంటి నాయికలు ఒకప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటే.. నేటితరం నాయికలు ట్రెండ్స్‌ గురించి చెబుతున్నారు. 


1. రోజాతో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు మీనా. అన్నపూర్ణ స్టూడియోలో ‘ముగ్గురుమొనగాళ్లు’ సినిమాలోని ‘రాజశేఖరా’  పాట చిత్రీకరణ జరుగుతుండగా రోజాని కలిశారు. ఈ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు మీనా. 


2. ‘వెల్‌కమ్‌ టు ‘ఆరణ్మనై 3’ అంటూ ఓ పాట చిత్రీకరణకు సంబంధించి న ఫొటో షేర్‌ చేశారు రాశీఖన్నా. అలాగే కొత్త హెయిర్‌ స్టైల్‌ల్లో మరో ఫొటోను షేర్‌ చేశారు. 


3. నువ్వు లేకపోతే జీవితం ఒకలా ఉండదు అంటూ తన స్నేహితురాలు శిల్పారెడ్డి గురించి ఓ పోస్ట్‌ చేశారు సమంత. 


4. చల్లని వాతావరణానికి బద్దకం పెరిగిపోతుంది అంటోంఇ పిల్లి కళ్ల సుందరి స్నేహా ఉల్లాల్‌. 


5. ‘హీరో’ సినిమాకు డబ్బింగ్‌ పూర్తి చేశానని చెబుతున్నారు జగపతిబాబు. శ్రీరామ్‌ ఆదిత్య డైరెక్ట్‌ చేస్తున్న ఈచిత్రంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. 


6. ‘బ్రోడాడీ’ టీం నేనొస్తున్నా’’ అంటూ కారు జర్నీ చేస్తున్న ఫొటోని పంచుకున్నారు నటి మీనా. 


7. మూడు గంటల్లో 15 కిలోల బరువ పెరగడం ఎలా అంటూ ఓ చిట్కా చెబుతున్నారు కృతి కర్భందా. 


8. ‘జుట్టుని కొంచెం పక్కని నెట్టు.. ముఖం కనిపించడం లేదు’ అని తన ఫొటోకి తానే కామెంట్‌ పెట్టింది కేథరిన్‌. 


9. ‘నేనేమీ ఎక్ట్‌పెక్ట్‌ చేయడం లేదు... ఎందుకంటే నువ్వు నన్ను నిరుత్సాహపరచవని నమ్మకం’ అని భర్త గురించి ఓ పోస్ట్‌ చేశారు పూజా రామచంద్రన్‌. 


10. ప్రస్తుతం వెళ్లలేని ప్రదేశాల గురించి ఊహల్లో విహరిస్తున్నారు శుభ్ర అయ్యప్ప.