వర్షంలో తమన్నా.. షూట్‌లో కాజోల్‌!

సినీ తారల సోషల్‌ మీడియా టాక్‌

బాలీవుడ్‌ బ్యూటీ మాధురీ దీక్షిత్‌ 25 మిలియన్ల ఫాలయర్లను సంపాదించుకున్నారు. ఆమెను ఫాలో అయ్యే అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.


1. నేను జాస్మిన్‌లాంటి అమ్మాయిని అంటోంది అమలాపాల్‌. 

 

2. వర్షంలో మరో రోజు అంటూ ఓ ఫొటో షేర్‌ చేశారు మిల్కీబ్యూటీ తమన్నా. 


3. చాలాకాలం తర్వాత సినిమా సెట్లో ఉన్న అనుభూతి పొందుతున్నా అంటూ నటి కాజోల్‌ ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. 


4. ఫాహద్‌ ఫాజిల్‌కు తాను పెద్ద అభిమానినంటూ నజ్రియా ఒక సెల్ఫీ తీసుకున్నారు. తన భర్త ఫాహద్‌ నటించిన ‘మాలిక్‌’ సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే! 


5. రామ్‌ హీరోగా లింగుస్వామి తెరకెక్కిస్తున్న చిత్రంలో ఆది నెగిటివ్‌ షేడున్న క్యారెక్టర్‌ చేస్తున్నారు. దాని కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు ఆది పినిశెట్టి. దీనికి సంబంధించిన ఫొటోను షేర్‌ చేశారు. 


6. ఒక మెలోడీ సాంగ్‌ను ఆలపిస్తున్నారు గాయని సునీత. త్వరలో రాబోతుంది అని తెలిపారు.


7. మండే మూడ్స్‌ అంటూ స్టైలిష్‌గా దర్శనమిచ్చారు అర్జున్‌ కపూర్‌. 

Advertisement
Advertisement