‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా సెట్స్‌లో రష్మికతో కలిసి రాధిక శరత్‌కుమార్, ఊర్వశి సందడి చేశారు. అలనాటి నటి సావిత్రి అభినయించిన ‘నవరాత్రి’ గీతాన్ని పాడుతూ అలరించారు. మరికొందరు తారలు సోషల్ మీడియాలో సందడి చేశారు.
‘గులాబీ, చాక్లెట్.. ఈ రెండింటిలో ఒకటి ఎంపిక చేసుకోండి అంటోంది పూజా హెగ్డే. కొత్త ఫొటో షూట్‌తో అలరించారామె!
అనుపమ పరమేశ్వరన్ ఎంతో ఆనందంగా కనిపించారు. సరదాగా తీసుకున్న సెల్ఫీలను షేర్ చేసి ‘క్రేజీ’ అనే హ్యాష్‌ట్యాగ్ జతచేసింది.
తన కొత్త స్టిల్స్‌ని షేర్ చేసింది నటేశ్. మీనాక్షి చౌదరి తన కొత్త ఫొటోల్ని పంచుకుంటూ గత జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంది.
పరుగు తీయడం ఎప్పుడూ మంచిదే అంటుంది నభా నటేశ్.