May 29 2021 @ 22:02PM

ఓఎస్టీ అద్భుతమంటున్న తమన్‌.. మిస్‌ అవుతున్నా వరూ!

సినీ సెలబ్రిటీల సోషల్‌ మీడియా సందడి

సొషల్‌ మీడియా వేదికగా సినీ తారలు సందడి చేశారు. తమకు సంబంధించిన ఆసక్తికర విశేషాలను షేర్‌ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. 


1. గుడ్‌ హెయిర్‌ డే అంటూ అందమైన ఫొటో పంచుకున్నారు మాధురీ దీక్షిత్‌. 


2. ‘చాలా మిస్‌ అవుతున్నా’ అంటూ గతంలో జిమ్‌ చేసిన వీడియో షేర్‌ చేశారు వరలక్ష్మీ శరత్‌ కుమార్‌. ‘‘అందరూ మాస్క్‌ ధరించండి. వ్యాక్సిన్‌ వేయించుకోండి. ఆరోగ్యంగా ఉండండి’’ అని కోరారు. 


3. ‘వకీల్‌ సాబ్‌’ ఒరిజినల్‌ సౌండ్‌ ట్రాక్‌ (ఓఎస్టీ) అద్భుతంగా వచ్చిందని తమన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపారు. 


4. తన తల్లిదండ్రుల 55వ వివాహ వేడుక సందర్భంగా వారి ఫొటోను షేర్‌ చేసి ‘మీరే నాకు స్ఫూర్తి’ అంటూ రవీనా టాండన్‌ రాసుకొచ్చారు. 


5. తన క్యూట్‌ నవ్వుతో. నెమలి నడకతో ఫొటోకు పోజిచ్చింది తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. 


6. తన స్నేహితురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఇషాచావ్లా


7. ‘చివరికి  అంతా బాగానే ఉంటుంది. ఒకవేళ బాగోకపోతే అది ఎండ్‌ కాదని అర్థం’ అంటున్నారు ఆషీమ నర్వల్‌. 

8. ‘ప్రేమ కోసం ఎంతవరకూ వెళ్లగలరు’ అంటూ ‘ఏక్‌ మినీ కథ’లోని ఓ ఫొటో షేర్‌ చేశారు శ్రద్థాదాస్‌. 


9. తన సోదరుడు అక్షయ్‌ పరమేశ్వరన్‌తో కలిసి అల్లరి చేసింది అనుపమ పరమేశ్వరన్‌. ఇందులో అనుపమని ఎత్తుకుని కనిపించాడు అక్షయ్‌.


10. రీలాక్స్‌.. రీఫ్రెష్‌.. రివైవ్‌ అంటూ స్విమ్మింగ్‌పూల్‌లో జలకాలాడుతున్న ఓ ఫొటో షేర్‌ చేశారు బాలీవుడ్‌ హాట్‌ బాంబ్‌ మల్లికా శెరావత్‌. 


11. రంగీలా సమయంతో ఊర్మిళతో తనకున్న జ్ఞాపకాల్ని ఓ ఫొటోతో గుర్తు చేసుకున్నారు ఆర్‌జీవీ. 


12. నటి అమైరా దస్తర్‌ మొదటి వ్యాక్సిన్‌ వేయించుకున్నా అని ఫొటోతో తెలిపారు.