May 26 2021 @ 22:24PM

రెండు జళ్ల నేహా.. జలకాలాటల రీతు!


సినీ తారల సోషల్‌ టాక్‌

సినీ తారలు సోషల్‌ మీడియాలో సందడి చేశారు. తమ గురించి ఆసక్తి విషయాలను పంచుకున్నారు. 


1. తన భార్య, కూతురితో దిగిన ఫొటోని అభిమానులతో పంచుకున్నారు ఆది సాయికుమార్‌. 


2. రెండు జడలు వేసుకుని చిన్న పిల్ల ఎక్స్‌ప్రెషన్‌తో సందడి చేస్తోంది చిరుత బ్యూటీ నేహా శర్మ.


3. ప్రతి విషయం గురించి తెలుసుకోవాలని ప్రయత్నిేస్త ప్రశాంతంగా ఉండలేం అంటోంది హెబ్బా పటేల్‌.


4. వేసవిలో చల్లదనాన్ని ఆస్వాదించడం కోసం స్విమ్మింగ్‌ పూల్‌లో జలకాలాటలాడుతూ హాట్‌ ఫొటో షేర్‌ చేశారు రీతూ వర్మ. 


5. రెడ్‌ అంటే ప్రేమకు, ప్రమాదానికి గుర్తు అని ఎర్ర రంగు గురించి చెప్పుకొచ్చింది నైనా  గంగూలీ. 


6. తన పాత గుర్తులు నెమరు వేసుకుంటూ ఓ ఫొటో పంచుకున్నారు సురభి. 


7. అందం, అభినయం ఉన్న నివేదా పేతురాజు ట్రెడిషనల్‌ లుక్‌లో ఓ ఫొటో పంచుకున్నారు. 


8. మగత కళ్లు, గజిబిజి జుట్టు, నిద్ర మత్తు వదలని మొహం అంటూ సెల్ఫీ పోస్ట్‌ చేశారు అనన్యా నాగళ్ల. 


9. 'సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్‌’ సినిమాకు అభిమానులు, పరిశ్రమ నుంచి వచ్చిన ప్రశంసలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు పరిణీతి చోప్రా.