May 23 2021 @ 21:23PM

నాయికల సొగసులు... ఇంకేం కావాలి మాకు!

సినీ తారల సోషల్‌ టాక్‌! 

రొమాన్స్‌కు, కమర్షియల్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ దర్శకుడు రాఘవేంద్రరావు పుట్టిన రోజు నేడు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆయనకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ‘పెళ్లి సందడి’ సీక్వెల్‌ వస్తున్న సంగతి తెలిసిందే! 


1. మీ సినిమాకు క్యూలో నిలబడే వాళ్లం.. అలాంటిది మీరే పక్కన నిలబడి ఆశీర్వదించారు. ఇంతకన్నా ఇంకేం కావాలి మాకు.. అని రాఘవేంద్రరావుతో కలిసి దిగిన ఫొటో పోస్ట్‌ చేశారు దర్శకుడు హరీశ్‌ శంకర్‌.


2. ఎర్ర చీర కట్టుకుని లేడీ ఇన్‌ రెడ్‌ అంటూ సందడి చేస్తోంది రాయ్‌ లక్ష్మీ. నా అభిమానులకు ఈ వీడియో అంకితం అని చెప్పింది. 


3. స్కైడ్రైవ్‌ చేసిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు ఊర్వశి రౌతేలా.


4. ‘ప్లే బ్యాక్‌’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నానంటూ ఓ వీడియో షేర్‌ చేశారు అనన్యా నాగళ్ల. 


5. కాజల్‌ తన ఇంటి టెర్రస్‌ మీద కెమెరాకు ఫోజులిచ్చారు. 


6. కావలసినంత ప్రేమ నా చుట్టూ ఉంది అంటున్నారు నమ్రత. తన గారాట పట్టీ సితారా తీసిన సెల్ఫీ పోస్ట్‌ చేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


7. మహిళ అంటేనే కాన్ఫిడెన్స్‌ అంటున్నారు మోనల్‌ గజ్జర్‌.


8. మళ్లీ వర్క్‌ స్టార్క్‌ అయితే నేనిలా ఉంటాను అంటూ ఓ వీడియో షేర్‌ చేశారు మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌.