నిండుకుండలా శ్రీశైల జలాశయం

ABN , First Publish Date - 2022-08-12T05:22:01+05:30 IST

కృష్ణమ్మ పరవళ్లతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది.

నిండుకుండలా శ్రీశైల జలాశయం
పది గేట్లు ఎత్తడంతో దిగువకు వెళ్తున్న కృష్ణమ్మ

భారీగా నమోదయిన ఇన్‌ఫ్లో
పది గేట్లు 15 అడుగులమేర ఎత్తి నీటి విడుదల
జలాశయం అవుట్‌ఫ్లో 4,38,247 క్యూసెక్కులు
డ్యాం వద్ద సందర్శకుల తాకిడి


శ్రీశైలం, ఆగస్టు 11: కృష్ణమ్మ పరవళ్లతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. దీంతో డ్యాం వద్ద సందర్శకుల తాకిడి పెరిగింది. ఎగువ కురిసిన వర్షాలతో జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. డ్యాం పది క్రస్టు గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,76,670 క్యూసెక్కుల నీటిని, జలాశయం కుడి, ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రాల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 61,577 క్యూసెక్కుల నీటిని మొత్తంగా 4,38,247 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 2,72,034 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 1,74,493 క్యూసెక్కులు జలాశయానికి మొత్తం 4,46,527 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది.

Updated Date - 2022-08-12T05:22:01+05:30 IST