నిండుకుండలా Medigadda బ్యారేజ్

ABN , First Publish Date - 2022-07-06T14:46:17+05:30 IST

భారీ వర్షాల కారణంగా జిల్లాలోని మేడిగడ్డ(కాళేశ్వరం లక్ష్మీ) బ్యారేజ్ నిండుకుండను తలపిస్తోంది.

నిండుకుండలా Medigadda బ్యారేజ్

జయశంకర్ భూపాలపల్లి: భారీ వర్షాల కారణంగా జిల్లాలోని మేడిగడ్డ(కాళేశ్వరం లక్ష్మీ) బ్యారేజ్ నిండుకుండను తలపిస్తోంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అధికారులు బ్యారేజ్‌లోని 30 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ ఫ్లో 48,700 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 69,350 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజ్ పూర్తి సామర్ధ్యం 16.17 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటిమట్టం 7.259 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

Updated Date - 2022-07-06T14:46:17+05:30 IST