నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్టు నమోదు చేయండి

ABN , First Publish Date - 2021-06-13T05:14:56+05:30 IST

నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై పీడీయాక్ట్‌ నమోదు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పోలీసులను ఆదేశించారు.

నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్టు నమోదు చేయండి
వీసీలో పాల్గొన్న సీపీ, జిల్లా వ్యవసాయ అధికారి, తదితరులు

పోలీసులకు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశం
ఖిల్లా, జూన్‌ 12: నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై పీడీయాక్ట్‌ నమోదు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పోలీసులను ఆదేశించారు. శనివారం ఆయన నకిలీ విత్తనాల నిరోధంపై డీ జీపీ మహేందర్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావుతో కలిసి హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. విత్తన డీలర్లను, ప్రాసెసింగ్‌ సంస్థలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని మంత్రి సూచించారు. విత్తన లైసెన్స్‌లు ప్రదర్శించకపోవడం, స్టాక్‌ రిజిస్టర్‌ను నవీకరించకపోవ డం, విత్తన లైసెన్స్‌లు లేకుండా వ్యాపారం నిర్వహించే వారి పట్ల పోలీసులుకఠినంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. కిందిస్థాయి నుంచి ఉన్న తస్థాయి వరకు అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు విత్తన వ్యాపారులపై నిఘా పెట్టాలన్నారు. దీంతో నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు రైతులకు అందకుండా అరికట్టవచ్చన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్తికేయ, వ్యవసాయశాఖ అధికారి గోవింద్‌, డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ అర్వింద్‌బాబు, అదనపు డీసీపీ లా అండ్‌ ఆర్డర్‌ శ్రీని వాస్‌కుమార్‌, అదనపు డీసీపీ ఆపరేషన్‌ స్వామి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వాజిద్‌హుస్సేన్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్లు, సీఐలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-13T05:14:56+05:30 IST