Abn logo
Sep 26 2021 @ 23:52PM

పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ

చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నమంత్రి గంగుల కమలాకర్‌

 - మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 26: వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఆదివారం చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌ రోడ్‌లోని మల్టీప్లెక్స్‌ కూడలి వద్ద గల ఐలమ్మ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావి తరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన మహనీయురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు. చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. వీరనారి చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని మంత్రి అన్నారు.  కార్యక్రమంలో కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, మేయర్‌ వై సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌, తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూసాలసంపత్‌, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.