Abn logo
Aug 4 2021 @ 00:20AM

ఎస్సీ వర్గీకరణ సాధించే వరకూ పోరాటం

గుండ్లపల్లెలో జెండా ఆవిష్కరిస్తున్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు

తంబళ్లపల్లె, ఆగస్టు 3: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసే వరకూ మాదిగల పోరాటం ఆగదని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర ఆధికార ప్రతినిధి నరేంద్ర మాదిగ అన్నారు. మంగళవారం గుండ్లపల్లె దళితవాడలో ఎమ్మార్పీఎస్‌ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మాదిగలు ఐక్యంగా ఉంటేనే భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను సాధించుకోగలమన్నారు. కార్యక్రమంలో  దమ్ముచిన్నా, తిరుపాల్‌, ఈశ్వరప్ప, రవి తదితరులు పాల్గొన్నారు.