న్యాయం జరిగే వరకూ పోరాటం

ABN , First Publish Date - 2021-11-30T05:12:24+05:30 IST

పోలవరం ఎడమ కాలువ నిర్మాణంలో నష్టపోతున్న రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుదామని రైతు సంఘం జాతీయ నాయకుడు వి.శ్రీనివాసరావు అన్నారు.

న్యాయం జరిగే వరకూ పోరాటం
వేపాడ: రైతులతో ర్యాలీ చేస్తున్న జాతీయ నాయకుడు శ్రీనివాసరావు

  రైతు సంఘ జాతీయ నాయకుడు శ్రీనివాసరావు  

  కాలువ నిర్మాణం కోసం పంట భూములు లాక్కోవడం తగదు

వేపాడ: పోలవరం ఎడమ కాలువ నిర్మాణంలో నష్టపోతున్న రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుదామని రైతు సంఘం జాతీయ నాయకుడు వి.శ్రీనివాసరావు అన్నారు. జాకేరు-కరకవలస గ్రామాల మధ్య కాలువ నిర్మా ణం కోసం గుర్తించిన పంట పొలాలను సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, జిల్లా రైతు సంఘ కార్యదర్శి చల్లా జగన్‌ ఆధ్వర్యంలో ఆయన సోమవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతుల అనుమతి లేకుండా కాలువ నిర్మాణం కోసం పంట భూములు లాక్కోవడం తగదని, ఆ అధికారం వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. రైతులపై కాంట్రాక్టర్లు, రెవెన్యూ అధికారులు కేసులు పెట్టడం కాదని రైతులే వారిపై కేసులు పెట్టాలని పిలుపునిచ్చారు. గ్రామసభలు పెట్టకుండా, కనీసం ఎటువంటి సమాచారం ఇవ్వకుండా భూ సేకరణ ఎలా చేపడడతా రని ప్రశ్నించారు.  అధికారులు స్పందించి కొన్ని ప్రాంతాల్లో కాలువ డిజైన్‌లో మార్పులు చేపట్టి 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాం డ్‌ చేశారు. వేపాడ, వల్లంపూడి, దబ్బిరాజు పేట, కరకవలస, గుడివాడ, జాకే రు, వెంకటరమణపేట గ్రామాల రైతులు, సంఘ నాయకులు పాల్గొన్నారు.


 

Updated Date - 2021-11-30T05:12:24+05:30 IST