జీవో 317 సవరించే వరకు పోరాటం

ABN , First Publish Date - 2022-01-29T03:35:21+05:30 IST

ఉద్యోగ విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన జీవో 317ను సవరిం చాలని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యా లయం ఎదుట ఉపాధ్యాయులు చేస్తున్న రిలే నిరా హార దీక్షలు 5వ రోజున శుక్రవారం డీసీసీ అధ్య క్షురాలు సురేఖ పాల్గొని సంఘీభావం తెలిపారు.

జీవో 317 సవరించే వరకు పోరాటం
ఉపాధ్యాయుల దీక్షలకు మద్దతు తెలుపుతున్న డీసీసీ అధ్యక్షురాలు సురేఖ

ఏసీసీ, జనవరి 28 : ఉద్యోగ విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన జీవో 317ను సవరిం చాలని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యా లయం ఎదుట ఉపాధ్యాయులు చేస్తున్న రిలే నిరా హార దీక్షలు 5వ రోజున  శుక్రవారం డీసీసీ అధ్య క్షురాలు సురేఖ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఉపాధ్యాయులు చేస్తున్న ఉద్యమం న్యాయసమ్మత మైందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యా యులకు అన్యాయం చేసిందని విమర్శించారు. స్ధానిక తకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేయడం దారుణమన్నారు. బదిలీల వల్ల సీని యర్‌లు మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహించే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభు త్వం ఉపాధ్యాయుల పట్ల కఠిన వైఖరిని విడనాడాలని కోరారు. భార్యభర్తలకు ఒకే చోట పోస్టింగ్‌ ఇవ్వాలనే నిబంధనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.  బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పూదరి తిరుపతి, నాయకులు తూముల నరేష్‌, సురేందర్‌  పాల్గొన్నారు. 

టీఎస్‌యూటీఎఫ్‌ మద్దతు 

 ఉపాధ్యాయులు చేస్తున్న రిలే దీక్షలకు తెలంగాణ స్టేట్‌ యునైటెడ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(టీఎస్‌యూటీఎఫ్‌) నాయకులు శుక్రవారం మద్దతు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల రాజవేణు మాట్లాడుతూ జీవో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. స్ధానికత కోల్పోయిన జూనియర్‌ ఉపాధ్యాయులకు స్ధానికత ఆధారంగా తిరిగి పోస్టింగ్‌ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఉదాసీనత వైఖరికి నిరసనగా శనివారం ఛలో కలెక్టరేట్‌  నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  డీటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి జాకీర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మంచిర్యాల కలెక్టరేట్‌: రాష్ట్ర ప్రభుత్వం 317 జీవోను సవరించే వరకు పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు రామడుగు లక్ష్మణ్‌ పేర్కొన్నారు. శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించి ఏవో సురేష్‌కు వినతిపత్రం అందించారు.  ఆయన మాట్లాడుతూ స్ధానికతకు సంబంధం లేకుండా ఉపాధ్యాయ సంఘాలతో  చర్చలు జరపకుండా ప్రభు త్వం జోనల్‌, మల్టీ జోనల్‌ పేరుతో గందరగోళానికి తెరలేపిందని, ఈ జీవోను సవరించే వరకు పోరాటాలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగులను గందరగోళానికి గురి చేస్తోందని, రాష్ట్రపతి జీవోను సవరించే అధి కారం ఉన్నా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రం కలుగజేసుకుంటే ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమవుతాయని, రాజకీయ లబ్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద విధానాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు.  ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు, నాయకులు చిప్ప నర్సయ్య, జోగుల మల్లయ్య, రేగుంట చంద్రశేఖర్‌, మిట్టపల్లి పౌలు, దేవి పోచన్న, గుండ మాణిక్యం, ప్రశాంత్‌, బాపు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-29T03:35:21+05:30 IST