ప్రభుత్వంతో పోరాడండి

ABN , First Publish Date - 2022-01-24T06:24:53+05:30 IST

‘మేము మీకు అండగా ఉంటాం. పీఆర్సీపై ప్రభుత్వంతో ధైర్యంగా పోరాడండి’ అని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్‌, కార్మిక సంఘాల నేతలు రాష్ట్ర జేఏసీ నేతలకు భరోసా ఇచ్చారు

ప్రభుత్వంతో పోరాడండి
మాట్లాడుతున్నఅతావుల్లా... హాజరైన వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్‌, కార్మిక సంఘాల నాయకులు

సీఎస్‌, ప్రభుత్వ పెద్దల మాటలకు తలూపకండి

ఆమోదయోగ్యమైన పీఆర్సీ కోసం దశల వారీగా పోరాటాలు

అనంత ఉద్యమస్ఫూర్తిని చాటిచెబుతాం

25 నుంచి ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలు

పీఆర్సీ సాధన సమితి రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్‌, కార్మిక సంఘాల నేతలు

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, జనవరి 23: ‘మేము మీకు అండగా ఉంటాం. పీఆర్సీపై ప్రభుత్వంతో  ధైర్యంగా పోరాడండి’ అని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్‌, కార్మిక సంఘాల నేతలు రాష్ట్ర జేఏసీ నేతలకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పెద్దలు, సీఎస్‌ చెప్పే మాటలకు, అశాస్ర్తీయమైన అంశాలకు తలూపకుండా హక్కుల సాధన కోసం పోరాడాలన్నారు. ఆదివారం కృష్ణకళామందిరంలో ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలతో పాటు పలు కార్మిక, పెన్షనర్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ సంఘాల ఆధ్వర్యంలో ‘పీఆర్సీ సాధన సమితి’ పేరిట రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఏపీ జేఏసీ జిల్లా చైర్మన అతావుల్లా మాట్లాడు తూ ఒకప్పుడు పీఆర్సీ కావాలని ప్రతి ఉద్యోగి, ఉపాధ్యా యుడు, పెన్షనర్‌, కార్మికులు ప్రభుత్వాలతో పోరాడారన్నారు. అదే ప్రస్తుతం పీఆర్సీ మాకు వద్దే వద్దని  వేడుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.  తాజాగా  సీఎస్‌, ప్రభుత్వ పెద్దలతో విడుదల చేస్తున్న పీఆర్సీ చూస్తే ఎవరికి పెంచారో? ఎక్కడ పెంచారో అర్థంకాని ప రిస్థితి ఉందన్నారు. ఎవరికీ అమోదయోగ్యంకాని పీఆర్సీని బహిర్గతం చేసి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్‌, కార్మిక వర్గాలకు తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.  రాష్ట్ర నేతలు ఉద్యమంలో వెనకడుగు వేస్తే తీవ్ర పరిణా మాలు ఉంటాయని హెచ్చరించారు. ఉద్యమకార్యచరణలో భాగంగా ఈ నెల 25న జిల్లా కేంద్రంలో ర్యాలీలు, 26న డివిజన, మండల కేంద్రాల్లో అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతి పత్రాలు, 27 నుంచి 30వ తేదీ వరకూ రిలే నిరాహార దీక్షలు చేపడతామన్నారు. ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమం ఉంటుందన్నారు. ఫిబ్రవరి 5వ తేదీన సహా య నిరాకరణ ఉంటుందన్నారు. అప్పటికీ జీఓలను రద్దు చేయకపోతే ఫిబ్రవరి 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మె కొనసాగుతుందన్నారు. తద్వారా అనంత ఉద్యమస్ఫూర్తిని రాష్ట్ర ప్రభుత్వానికి చాటిచెప్తామన్నారు. ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన దివాకర్‌ మాట్లాడుతూ జగన మాట తప్పడు మడమ తిప్పడనే నమ్మకంతో గత ఎన్ని కల్లో ఓట్లు వేసి వైసీపీని గెలిపించామన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాటల తప్పు తారని ఎవరూ ఊహించలేదన్నారు. పీఆర్సీ సాధన కోసం  ఉద్యమం చేయక తప్పదన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు గోపికృష్ణ మాట్లాడుతూ మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని రెండుమూలు నెలల నుంచి ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు.  మెరుగైన పీఆర్సీ సాధన కోసం ఉద్యమాలు తప్పవన్నారు. కార్యక్ర మంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబుళు, ఆంధ్రప్రదశ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట చెన్నప్ప, ఏపీ జేఏసీ నగర చైర్మన మనోహర్‌ రెడ్డి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీరామమూర్తి, ఏపీజీఈఎఫ్‌ చైర్మన రాధాకృ ష్ణారెడ్డి, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి నరసింహులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాధవ, ఏపీటీఎఫ్‌257 రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనంకి అశోక్‌కుమార్‌,  ఏపీటీఎఫ్‌ కోడూరు శ్రీనివాసులు, సిరాజుద్దీన, యూటీఎఫ్‌ నాగేంద్ర, ఎక్సైజ్‌ నరసింహులు, కమర్షియల్‌ ట్యాక్స్‌ వెంకటే్‌షబాబు, ఎస్టీయూ నాయకులు రమణారెడ్డి, సూర్యుడు, ఏపీటీఎఫ్‌ 1938 నాయకులు రవీంద్ర, విశ్వనాథ్‌రెడ్డి, వెంకటరెడ్డి, ఆప్టా వెంకటరత్నం, డీటీఎఫ్‌ బాబు, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షులు రమే్‌షబాబు, నాయకులు బాషా, భాస్కర్‌, బాబు, రామాంజనేయులు, మల్లికార్జున, ఏపీఎన్జీఓ నాయకులు రవికుమార్‌, వేణుగోపాల్‌, శ్రీఽధర్‌బాబు జమీలాబేగం, వేణుగోపాల్‌, శ్రీధర్‌స్వామి, చంద్రమోహన, సాంబ, శివమ్మ, వెంకటరమణ, నాగభూషణరెడ్డి, ఫరూక్‌, సీపీఎం నాయకులు నాగేంద్రకుమార్‌, ఆర్‌వీ నాయుడు, సీఐటీయూ నాయకులు వెంకటనారాయణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T06:24:53+05:30 IST