మాట్లాడుతున్న గూడూరి ఎరిక్షన్‌బాబు
ఎర్రగొండపాలెం, జనవరి 28: ప్రజా సమస్యలపై పోరాడాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబు పిలుపునిచ్చారు. శుక్రవారం ఎర్రగొండపాలెంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన టీడీపీ పెద్దారవీడు మండల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరి ష్కారానికి కృషి చేయాలన్నారు. కొత్తాగా నియమితులైన బూత్ కమిటీ కన్వీనర్లు పార్టీ పటిష్టతకు పాటుపడాలన్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజలోకి తీసుకెళ్లాలన్నారు. పెద్దారవీడు మండలంలో 42 బూత్ కమిటీలకు కన్వీనర్లను నియమించారు. అలాగే, 8 మంది ఏరియా కన్వీనర్లు, ఇద్దరు క్లష్టరు ఇన్‌చార్జీలను నియమించారు. సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు వి.వెంకటరెడ్డి, నాయకులు జడ్డా రవి, గుమ్మా గంగరాజు, గొట్టం శ్రీనివాసరెడ్డి, దొడ్డ బాస్కరరెడ్డి, ఎం.శ్రీనివాసరెడ్డి, ఈ.రామకిష్ణారెడ్డి, ఆకుమల శ్రీనివాసరెడ్డి, దొడ్డ వెంకటేశ్వరరెడ్డి, యేర్వ పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.