కాంగ్రెస్‌లో ఆధిపత్యపోరు!

ABN , First Publish Date - 2022-04-20T05:29:08+05:30 IST

జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని నేతల ఆధిపత్య పోరు వెంటాడుతోంది. ఉమ్మడి జిల్లాలో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్‌ ప్రస్తుతం అంతర్గత విభేదాలతో చతికిలపడుతోంది. 2004, 2009 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా లో కంచుకోటగా ఉన్న కాంగ్రెస్‌ నేతల మధ్య ఆధిపత్య పోరుతో సతమతమవుతోంది. పార్టీ ఓటమిలతో నేతల మధ్య సఖ్యత కుదరక పోవడంతో ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.

కాంగ్రెస్‌లో ఆధిపత్యపోరు!

జిల్లాలో కాంగ్రెస్‌ నేతల మధ్య కోల్డ్‌వార్‌

తారాస్థాయికి అంతర్గత విభేదాలు

నేతల మధ్య కుదరని సఖ్యత

అయోమయంలో పార్టీ క్యాడర్‌

నిజామాబాద్‌అర్బన్‌, ఏప్రిల్‌ 19: జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని నేతల ఆధిపత్య పోరు వెంటాడుతోంది. ఉమ్మడి జిల్లాలో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్‌ ప్రస్తుతం అంతర్గత విభేదాలతో చతికిలపడుతోంది. 2004, 2009 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా లో కంచుకోటగా ఉన్న కాంగ్రెస్‌ నేతల మధ్య ఆధిపత్య పోరుతో సతమతమవుతోంది. పార్టీ ఓటమిలతో నేతల మధ్య సఖ్యత కుదరక పోవడంతో ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. వ చ్చే ఎన్నికల కోసం సన్నద్ధం కావాల్సిన ప్రస్తుత తరుణంలో నేతల మధ్య వర్గపోరు పార్టీకి కొత్త తలనొప్పులు తెస్తోం ది. ఒకవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీకి పూర్వవైభవం కోసం ప్రయత్నాలు చేస్తుంటే జిల్లాకు చెందిన ముఖ్యనేతల మధ్య ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితి నెలకొంది. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గానికి చెందిన ఒక నాయకుడికి ఆరు నెలల క్రితం ఎస్టీ సెల్‌ అధ్యక్షుడిగా నియమించగా.. ఆ నియామకాన్ని కొంతమంది నేతలు వ్యతిరేకించడంతో దానిని నిలిపివేశారు. ఇటీవల మళ్లీ అదే నాయకుడికి ఎస్టీ సెల్‌ అధ్యక్షుడిగా నియమించగా ఆ నియామకం చెల్లదని జిల్లాకు చెందిన రాష్ట్ర నాయ కులు ప్రకటన ఇవ్వడం చర్చనీయాంశమైంది.

 ఫ నియోజకవర్గాల్లో వర్గ పోరు..

నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఐదు నియోజకవర్గాలు ఉండగా ఐదు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు కొనసాగుతోంది. ముఖ్యంగా నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో వర్గపోరు తారాస్థాయికి చేరుతోంది. గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైన మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ తిరిగి వచ్చే ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమవుతుండగా ఆ నియోజకవర్గంలో టికెట్‌ ఆశిస్తున్న నేతలు ఆయనకు సహకరించడంలేదు. నిజామాబాద్‌ అర్బన్‌లోనూ నేతల మధ్య పొసగని పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో పోటీచేసిన తాహెర్‌బిన్‌ హుందాన్‌ మళ్లీ వచ్చే ఎన్నికల్లో టికెట్‌ కోసం ప్రయత్నిస్తుండగా.. గత ఎన్నికల్లో టికెట్‌ రాని నగర అధ్యక్షుడు కేశవేణు, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌లు నియోజకవర్గంలో పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి నియోజకవర్గ ఇన్‌చార్జి లేకపోగా ఆస్థానంపై ముఖ్యనేతలు దృష్టిపెట్టారు. బాల్కొండ నియోజకవర్గంలో నూ అంతర్గత విభేదాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో పోటీచేసిన మాజీ విప్‌ అనిల్‌ మళ్లీ టికెట్‌ తనకే వస్తుందని చెబుతున్నప్పటికీ ఇటీవల ఆయన మాజీ ఎంపీ, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీపై ఆయ న బహిరంగంగా చేసిన విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. బోధన్‌ నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండగా ఆయనకు మాజీ ఎంపీ మధుయాష్కీకి మధ్య ఉన్న విభేదాల వల్ల మధుయాష్కీ కెప్టెన్‌ కరుణాకర్‌రెడ్డిని ప్రోత్సహిస్తుండడంతో అక్కడ కూడా పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. కాగా, ఇటీ వల జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు సమీక్ష కు మధుమాష్కీ హాజరుకాకపోగా అతనిపై మాజీ విప్‌ అనిల్‌ చేసిన వ్యాఖ్యలు దుమా రం రేపాయి. అలాగే మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్‌ జిల్లాలో చేపట్టిన పాదయాత్రకు మధుయాష్కీతోపాటు మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి దూరంగా ఉన్నారు.

 ఫ పార్టీలో చేరికలపై మౌనం..

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత జిల్లాలో పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. కానీ ఆశించినమేర పార్టీలో చేరికలు జరగలేదు. పార్టీ లో ముఖ్య నేతలు చేరుతారనే ప్రచారం ఉన్నప్పటికీ నేతల మధ్య అంతర్గత విభేదాలు, ఒకరంటే ఒకిరికి పొసగని పరిస్థితుల్లో జిల్లాలో ఇతర పార్టీల నుంచి చేరే నేతల విషయంలో విభేదాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుండగా వారిపై కొంతమంది నేతలు ఫిర్యాదులు చేస్తుండడంతో చేరికలకు బ్రేక్‌ పడినట్లు సమాచారం. జిల్లాలకు చెందిన ఆయా విభాగాల చైర్మన్‌లను నియమించే అధికారం రాష్ట్ర కాంగ్రెస్‌ ఆ విభాగ అధ్యక్షుడికి ఉండగా జిల్లాకు చెందిన నేతలు నియామకం విషయంలో అభ్యంతరాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. మరో ఏడాదిలో ఎన్నికలు ఉండగా నేతల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీ జిల్లాలో పూర్వవైభవం కోల్పోతోంది. ఇప్పటికైనా నేతలు వ్యక్తిగత ఎజెండాను మానుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు.

Updated Date - 2022-04-20T05:29:08+05:30 IST