వైసీపీ, టీడీపీ వర్గీయుల ఘర్షణ.. మారణాయుధాలతో దాడి.. 18 మందికి గాయాలు

ABN , First Publish Date - 2020-08-01T19:26:11+05:30 IST

పెద్దకడుబూరు మండలం హనుమాపురం సమీపంలోని పొలం విషయంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుకుంది. 18 మంది గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.

వైసీపీ, టీడీపీ వర్గీయుల ఘర్షణ.. మారణాయుధాలతో దాడి.. 18 మందికి గాయాలు

పొలం విషయంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల ఘర్షణ

బాధితులను పరామర్శించిన టీడీపీ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి 


పెద్దకడుబూరు/ఎమ్మిగనూరు రూరల్‌(కర్నూలు):  పెద్దకడుబూరు మండలం హనుమాపురం సమీపంలోని పొలం విషయంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుకుంది.  18 మంది గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన   మేరకు.. హనుమాపురం గ్రామానికి చెందిన పెద్దయ్య, ఎల్లప్పకు కొన్నేళ్లుగా పొలం విషయంలో తగాదాలు ఉన్నాయి. టీడీపీ వర్గానికి చెందిన పెద్దయ్య సాగుచేస్తున్న పొలంలోకి వైసీపీకి చెందిన ఎల్లప్ప వర్గీయులు ట్రాక్టర్‌తో దున్నేందుకు వెళ్లారు. తమ పొలాన్ని ఎందుకు దున్నుతున్నారంటూ పెద్దయ్య  అభ్యంతరం తెలిపాడు. దీంతో వారు దాడికి దిగారు. ఇరువర్గాలకు చెందిన వారు 40 మంది ఉండగా, 18 మందికి గాయాలయ్యాయి. పోలీసులు చేరుకుని  ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టీడీపీకి చెందిన పెద్దయ్యతో పాటు మరో ఏడు మంది, వైసీపీ వర్గానికి చెందిన ఎల్లప్పతో పాటు మరో ఎనిమిది మందికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. పెద్దకడుబూరు ఎస్‌ఐ శ్రీనివాసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


సినిమా స్టంట్‌ను తలపించిన ఘర్షణ

ఘర్షణ సినిమా స్టంట్‌ను తలపించింది. ఆదోని రహదారికి పక్కనే పొలం ఉండడంతో జనం మొత్తం చేరుకున్నారు. ఇరువర్గాలు మారణాయుధాలు, కట్టెలు, రాళ్లు, కారంపొడితో  దాడులు చేసుకున్నారు.


పరామర్శించిన టీడీపి జిల్లా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి

ఘర్షణలో గాయపడి చికిత్స పొందుతున్న టీడీపీ వర్గీయు లను ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి, రమాకాంతరెడ్డి పరామర్శించారు. తమ పార్టీవారిపై దాడి హేయమైన చర్య అన్నారు.  మెరుగైన చికిత్స అందించేలా వైద్యులతో సంప్రదించామన్నారు.

Updated Date - 2020-08-01T19:26:11+05:30 IST