Advertisement
Advertisement
Abn logo
Advertisement

మైనర్ల మధ్య ఘర్షణ.. Friend‌ను కత్తితో పొడిచి పరారు.. అసలు కారణమదేనా..?

  •  ప్రేమవ్యవహారమే కారణమా? 


హైదరాబాద్ సిటీ/అడ్డగుట్ట : ఇద్దరు మైనర్లు అయిన స్నేహితుల మధ్య ఘర్షణతో ఒకరు కత్తితో పొడిచి పరారయ్యాడు. తుకారంగేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు స్థానికుల కథనం ప్రకారం.. అడ్డగుట్ట మసీద్‌ ప్రాంతానికి చెందిన రాజాక్‌ కుమారుడు షాగీర్‌ (18) అదే ప్రాంతానికి చెందిన ఇబ్బు (18) స్నేహితులు. బుధవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో షాగీర్‌ జేబులో ఉ న్న కత్తితో ఇబ్బును ఇష్టానుసారంగా పొడిచి పారిపోయాడు. గాయపడిన ఇబ్బును స్థానికులు వెంటనే ప్రైవేట్‌ ఆస్పత్రికి, అక్కడికి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇబ్బు పరిస్ధితి విషమంగా ఉందని తెలిసింది. స్థానికులు తుకారాం గేట్‌ పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు అరగంట అయినా రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సై నాయక్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారంలో వారి మధ్య ఘర్షణ జరిగి ఉంటుందని భావిస్తున్నారు.


Advertisement
Advertisement