విద్యుత్‌ చార్జీల పెంపుపై పోరాటం

ABN , First Publish Date - 2021-10-18T04:45:41+05:30 IST

రాష్ట్రంలో పెరిగిన విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని, విద్యుత్‌ కోతలను ఎత్తివేయాలని కోరుతూ పోరాటం చేస్తామని టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.

విద్యుత్‌ చార్జీల పెంపుపై పోరాటం
మాట్లాడుతున్న మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి తిక్కారెడ్డి

  1.  నేటినుంచి గ్రామాల్లో పర్యటన 


మంత్రాలయం,అక్టోబరు 17. రాష్ట్రంలో పెరిగిన విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని, విద్యుత్‌ కోతలను ఎత్తివేయాలని కోరుతూ పోరాటం చేస్తామని టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని మరచి ఇష్టానుసారంగా పాలన సాగిస్తోందని విమర్శించారు. అనధికారిక విద్యుత్‌ కోతల వల్ల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.  సోమవారం నుంచి   మంత్రాలయం మండలంలోని వగరూరు, వి.తిమ్మాపురం, బూదూరు గ్రామాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ  సమావేశంలో టీడీపీ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు

Updated Date - 2021-10-18T04:45:41+05:30 IST