నాచారం ఈఎస్‌ఐలో 50 మందికే పరీక్షలు

ABN , First Publish Date - 2020-07-09T10:19:16+05:30 IST

నాచారంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో రోజుకు 50మందికి మాత్రమే కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను అడిగేందుకు ప్రయత్నించగా స్పందించ లేదు.

నాచారం ఈఎస్‌ఐలో 50 మందికే పరీక్షలు

నాచారంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో రోజుకు 50మందికి మాత్రమే కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను అడిగేందుకు ప్రయత్నించగా స్పందించ లేదు. 


మారేడ్‌పల్లిలో సెలూన్ల మూసివేత

కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న ప్రస్తుత తరుణంలో మారేడ్‌పల్లి నాయీ బ్రాహ్మణ సేవా సంఘం వారు గురువారం నుంచి నాలుగురోజులపాటు సెలూన్లను స్వచ్ఛందంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. 


ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌కిట్స్‌తో పరీక్షలు 

20 నుంచి 30 నిమిషాల్లోనే ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌కిట్స్‌ ద్వారా కరోనా ఉన్నదీ లేనిది తెలుసుకునేందుకు శేరిలింగంపల్లి నియోజకవర్గానికి మంగళవారం 1,700 కిట్స్‌ వచ్చాయి. బుధవారం హఫీజ్‌పేట యూపీహెచ్‌సీలో 24 టెస్టులు చేయగా 22 నెగెటివ్‌, 2 పాజిటివ్‌, శేరిలింగంపల్లి యూపీహెచ్‌సీలో 25 టెస్టులు చేయగా 21 నెగెటివ్‌, 4 పాజిటివ్‌, రాయదుర్గం యూపీహెచ్‌సీలో 25 టెస్టులకు రెండు పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి రామిరెడ్డి తెలిపారు. కొండాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో పాత పద్ధ్దతిలోనే టెస్టులు చేస్తున్నారు. ర్యాపిడ్‌ టెస్ట్‌ చేయడం లేదని పలువురు తెలిపారు.  

Updated Date - 2020-07-09T10:19:16+05:30 IST