ఫిఫా మహిళల ప్రపంచకప్‌ జరిగేనా..?

ABN , First Publish Date - 2020-09-20T09:15:29+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్‌లో జరగాల్సిన ఫిఫా అండర్‌-17 మహిళల వరల్డ్‌క్‌పపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.

ఫిఫా మహిళల ప్రపంచకప్‌ జరిగేనా..?

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్‌లో జరగాల్సిన ఫిఫా అండర్‌-17 మహిళల వరల్డ్‌క్‌పపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ టోర్నీ మరోసారి వాయిదా పడే అవకాశాలున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది నవంబరులో జరగాల్సిన టోర్నీని వైరస్‌ కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చికి వాయిదా వేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. అంటే దాదాపు ఐదు నెలల సమయం మాత్రమే ఉంది. కానీ, కరోనా కారణంగా ఐరోపా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాలతోపాటు మరికొన్ని దేశాల్లో అర్హత టోర్నీల ప్రక్రియే మొదలుకాలేదు. దీంతో టోర్నీ మరోసారి వాయిదా పడే అవకాశాలున్నాయని భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎ్‌ఫఎఫ్‌) వర్గాలు తెలిపాయి. మరో వారం రోజుల్లో ఫిఫా నుంచి ప్రకటన రావొచ్చని చెప్పాయి. అండర్‌-17 వరల్డ్‌క్‌పనకు భారత్‌ తొలిసారి ఆతిథ్యం ఇస్తోంది. 

Updated Date - 2020-09-20T09:15:29+05:30 IST