ఫిఫా అండర్‌-17 మహిళల వరల్డ్‌ కప్‌

ABN , First Publish Date - 2021-04-11T09:06:33+05:30 IST

ఫిఫా అండర్‌-17 మహిళల వరల్డ్‌ కప్‌, ఏఎఫ్‌సీ మహిళల ఆసియా కప్‌ టోర్నీల డైరెక్టర్‌ రోమా ఖన్నా తన పదవులకు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు...

ఫిఫా అండర్‌-17 మహిళల వరల్డ్‌ కప్‌

  • టోర్నీ డైరెక్టర్‌ రాజీనామా


న్యూఢిల్లీ: ఫిఫా అండర్‌-17 మహిళల వరల్డ్‌ కప్‌, ఏఎఫ్‌సీ మహిళల ఆసియా కప్‌ టోర్నీల డైరెక్టర్‌ రోమా ఖన్నా తన పదవులకు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె శనివారం ప్రకటించారు. ఈ రెండు టోర్నీలు వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్నాయి. ప్రతిష్ఠాత్మక ఈ టోర్నమెంట్ల ఆతిథ్యాన్ని భారత్‌ దక్కించుకోవడంలో రోమాఖన్నా కీలక భూమిక పోషించారు. 


Updated Date - 2021-04-11T09:06:33+05:30 IST