జాగ దొరికింది

ABN , First Publish Date - 2022-05-27T05:14:53+05:30 IST

కొత్తగా ఏర్పాటైన రాయపోల్‌ మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణానికి స్థలం అందుబాటులో లేదు.

జాగ దొరికింది
అద్దె భవనంలో రాయపోల్‌ పోలీ్‌సస్టేషన్‌

పోలీ్‌సస్టేషన్‌ భవనం మంజూరే తరువాయి

ఇటీవల స్థలం అప్పగించిన రెవెన్యూ శాఖ

రాయపోల్‌, మే 26: కొత్తగా ఏర్పాటైన రాయపోల్‌ మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణానికి స్థలం అందుబాటులో లేదు. ఇన్నాళ్లూ స్థలం దొరకక పోవడంతో రాయపోల్‌లో పోలీ్‌సస్టేషన్‌భవన నిర్మాణానికి అడ్డంకిగా మారింది. ఎట్టకేలకు పోలీ్‌సస్టేషన్‌భవనం కోసం స్థలం దొరికింది. ఇక నిధుల మంజూరే మిగిలింది. రాయపోల్‌లో 2016 అక్టోబరు 11న మండల కేంద్రంతో పాటు పోలీ్‌సస్టేషన్‌ ఏర్పాటైంది. అప్పటినుంచి అరకొర వసతులతో అద్దె భవనంలోనే పోలీ్‌సస్టేషన్‌ కొనసాగుతున్నది. రాత్రింబవళ్లు పనిచేయాల్సిన పోలీ్‌సస్టేషన్‌లో వసతులు సరిగ్గా లేకపోవడంతో సిబ్బంది ఇబ్బందిగానే విధులు నిర్వహిస్తున్నారు. అప్పట్లోనే స్థలం ఉంటే పోలీ్‌సస్టేషన్‌భవన నిర్మాణం చేపడతారన్న వార్తలు వెలువడ్డాయి. కానీ రాయపోల్‌లో ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోవడంతో పోలీ్‌సస్టేషన్‌తో పాటు ప్రభుత్వ భవనాలన్నీ అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల రెవెన్యూ అధికారులు కొత్తపల్లి శివారులోని 265 సర్వే నంబరులో ఒకటిన్నర ఎకరాల స్థలాన్ని ఎంపికచేసి పోలీసుశాఖకు అప్పగించారు. స్థలం సమస్య తీరడంతో నిర్మాణానికి నిధులు మంజూరు కావడమే మిగిలింది. పోలీ్‌సస్టేషన్‌కు కేటాయించిన స్థలం పక్కనే కస్తూర్భా గాంధీ బాలికల గురుకుల పాఠశాల నిర్మాణం జరుగుతుండడంతో ఇక్కడ పోలీ్‌సస్టేషన్‌ఏర్పాటు చేస్తే విద్యార్థినులకు సెక్యూరిటీ సమస్య తొలగిపోనున్నదని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చొరవ తీసుకుని పోలీ్‌సస్టేషన్‌ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని కోరుతున్నారు.

Updated Date - 2022-05-27T05:14:53+05:30 IST