నామినేషన్‌ పత్రాలతో నిరుద్యోగులు, ఫీల్డ్‌ అసిస్టెంట్ల నిరసన

ABN , First Publish Date - 2021-10-08T00:52:50+05:30 IST

తమను నామినేషన్‌ వేయకుండా అధికారులు అడ్డుకుంటున్నారంటూ ఆరోపిస్తూ నిరుద్యోగులు, ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు నిరసన వ్యక్తం చేశారు.

నామినేషన్‌ పత్రాలతో నిరుద్యోగులు, ఫీల్డ్‌ అసిస్టెంట్ల నిరసన

కరీంనగర్‌: తమను నామినేషన్‌ వేయకుండా అధికారులు అడ్డుకుంటున్నారంటూ ఆరోపిస్తూ నిరుద్యోగులు, ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు నిరసన వ్యక్తం చేశారు. గురువారం హుజూరాబాద్‌లో నామినేషన్లు స్వీకరిస్తున్న ఆర్డీవో కార్యాలయం ఎదుట సుమారు వంద మందికిపైగా నిరుద్యోగులు, ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు నామినేషన్‌పత్రాలను ప్రదర్శిస్తూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ దూరం దూరంగా నిలబడి ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలను సమర్పించి హుజూరాబాద్‌, జమ్మికుంట రోడ్డులో ఉన్న అన్ని షాపులు, నివాస గృహాలకు వెళ్లి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఓడించాలని ప్రచారం నిర్వహించారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు నోటిఫికేషన్లు జారీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని, ఉద్యోగాల నుంచి తొలగించి ఏడు వేల మంది ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను రోడ్డున పడవేశారని వాపోయారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి తప్ప ఏ పార్టీకైనా ఓటు వేయాలని నిరుద్యోగులు, ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు ప్రజలను కోరారు. 

Updated Date - 2021-10-08T00:52:50+05:30 IST