కరీంనగర్: నామినేషన్ వేసేందుకు వచ్చిన ఫీల్డు అసిస్టెంట్లు హుజురాబాద్‌లో ఆందోళనకు దిగారు. తమను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తొలిరోజే అన్యాయంగా అరెస్టు చేశారని, మంత్రి హరీష్ రావు తమని నామినేషన్లు వేయనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి గ్రామం తిరిగి టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీ సత్యన్నారాయణతో వాగ్వాదానికి దిగారు.