సలాం సైనికా: రక్తదానం చేసి పాక్ ఉగ్రవాదిని కాపాడిన భారత సైన్యం

ABN , First Publish Date - 2022-08-25T02:19:14+05:30 IST

శ్రీనగర్: భారత సైన్యం రక్తదానం చేసి ఓ పాక్ ఉగ్రవాదిని కాపాడింది. ఈ నెల 21న జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ నౌషెరా సెక్టార్‌లో ఉన్న ఝాంగర్ వద్ద నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి అక్రమంగా

సలాం సైనికా: రక్తదానం చేసి పాక్ ఉగ్రవాదిని కాపాడిన భారత సైన్యం

శ్రీనగర్: భారత సైన్యం రక్తదానం చేసి ఓ పాక్ ఉగ్రవాదిని కాపాడింది. ఈ నెల 21న జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ నౌషెరా సెక్టార్‌లో ఉన్న ఝాంగర్ వద్ద నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి అక్రమంగా చొరబడుతూ తబరక్ హుస్సేన్ అనే ఉగ్రవాది దొరికిపోయాడు. మరో ముగ్గురు ఉగ్రవాదులతో కలిసి భారత్‌లోకి అక్రమంగా చొరబడుతుండగా సైన్యం జరిపిన కాల్పుల్లో తబరక్ హుస్సేన్‌కు రెండు బుల్లెట్ గాయాలయ్యాయి. బుల్లెట్లలో ఒకటి తొడలో, మరొకటి భుజానికి తాకింది. తీవ్ర రక్తస్రావమైన తబరక్ హుస్సేన్‌‌ను సైన్యం ఆసుపత్రికి తరలించింది. ఐసీయూలో ఉంచి చికిత్స అందించింది. ఓ నెగెటివ్ రక్తం అవసరం కాగా ముగ్గురు సైనికులు ముందుకొచ్చి రక్తం ఇచ్చారు. ప్రస్తుతానికి తబరక్ హుస్సేన్‌‌కు ప్రాణాపాయం తప్పింది. మరికొద్ది వారాల్లో అతడు పూర్తిగా కోలుకుంటాడని బ్రిగేడియర్ రాజీవ్ నాయర్ తెలిపారు.





పాకిస్థాన్ ఆర్మీ కల్నల్ యూనుస్ ఆదేశాల మేరకు భారత సైన్యంపై ఆత్మాహుతి దాడి చేసేందుకు తబరక్ హుస్సేన్‌ నియంత్రణ రేఖ దాటాడు. ఈ క్రమంలో భారత సైన్యం అతడిని పట్టుకుంది. భారత సైన్యంపై ఆత్మాహుతి దాడి జరిపేందుకు పాకిస్థాన్ ఆర్మీ కల్నల్ యూనుస్ తనకు 30 వేల రూపాయలు ముట్టచెప్పారని తబరక్ హుస్సేన్‌ చెప్పాడు. 





తమను హతమార్చేందుకు వచ్చిన పాక్ ఉగ్రవాదికి రక్తం అందించి ప్రాణాలు పోసిన భారత సైన్యంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.  

Updated Date - 2022-08-25T02:19:14+05:30 IST