ఫూలే ఆశయ సాధనకు యువత పాటుపడాలి

ABN , First Publish Date - 2020-11-29T06:38:43+05:30 IST

దేశంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు జ్యోతిరావు ఫూలే అని, ఆయన ఆశయ సాధనకు యువత పాటుపడాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు.

ఫూలే ఆశయ సాధనకు యువత పాటుపడాలి
\అమలాపురంలో ఫూలేకు నివాళులర్పిస్తున్న మాజీఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి తదితరులు

మండపేట: దేశంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి  పాటుపడిన మహనీయుడు జ్యోతిరావు ఫూలే అని, ఆయన ఆశయ సాధనకు యువత పాటుపడాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. ఫూలే వర్ధంతి సంద ర్భంగా మండపేట పెద్దకాల్వ వద్ద వున్న  ఫూలే విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల లువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో  మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ చుండ్రు శ్రీవర ప్రకాష్‌, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వి.సాయికూమార్‌బాబు, మాజీ కౌన్సిలర్లు సిద్దిరెడ్డి రామన్న, సూర్యప్రకాష్‌తోపాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పెద్దకాల్వ వంతెన వద్దవున్న ఫూలే విగ్రహనికి  నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పూలమాలలు వేసినివాళులర్పించారు. ఆయనతో పాటు పార్టీనాయకులు ముమ్మిడివరపు బాపిరాజు, పి.ప్రసాద్‌, శిరంగుశ్రీను  పెంకే గంగాదరం పాల్గొన్నారు. బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కోన సత్యనారాయణ కూడా మండపేటలో  ఫూలే విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.

అమలాపురం టౌన్‌: అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డ మహోన్నత వ్యక్తిగా మహాత్మా జ్యోతిరావుఫూలే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని మాజీ ఎమ్మెల్యే కుడు పూడి చిట్టబ్బాయి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్‌ కుడు పూడి సూర్యనారాయణరావులు పేర్కొన్నారు. పార్లమెంటు బీసీ సెల్‌ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ ఆధ్వర్యంలో శనివారం పూలే వర్ధంతి నిర్వహించారు. స్థానిక చిన్న పిల్లల పార్కు వద్ద ఉన్న ఫూలే విగ్రహానికి వారు  పూల మాలలువేసి నివా ళులుర్పించారు. బీసీ సెల్‌ కార్యదర్శులు వీరవల్లి చినబాబు, పిచ్చిక ప్రభాకర్‌, తాళా బత్తుల లక్ష్మణరావు, మట్టపర్తి నాగేంద్ర, బద్రి బాబ్జి, చెల్లు బోయిన శ్రీను, దొంగ శ్రీను, వాసం శెట్టి సుభాష్‌, వంటెద్దు వెంకన్నాయుడు, సుంకర లక్ష్మి, గనిశెట్టి రమణలాల్‌, తోట శ్రీను, బండారు గోవిందు  పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T06:38:43+05:30 IST