మరి కొద్ది గంటల్లో వివాహం.. పెళ్లి దుస్తుల్లోనే వరుడి ఆత్మహత్య.. ఎందుకో తెలిస్తే షాక్..!

ABN , First Publish Date - 2021-12-25T19:59:40+05:30 IST

పెళ్లికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది.. బంధుమిత్రులందరూ ఎంతో సంతోషంగా పెళ్లి వేడుకల్లో పాలుపంచుకుంటున్నారు..

మరి కొద్ది గంటల్లో వివాహం.. పెళ్లి దుస్తుల్లోనే వరుడి ఆత్మహత్య.. ఎందుకో తెలిస్తే షాక్..!

పెళ్లికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది.. బంధుమిత్రులందరూ ఎంతో సంతోషంగా పెళ్లి వేడుకల్లో పాలుపంచుకుంటున్నారు.. ఆ సమయంలో వారికో షాకింగ్ విషయం తెలిసింది.. వరుడు ఓ చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడని తెలిసి అందరూ అవాక్కయ్యారు.. పెళ్లి వేడుకలో డీజేకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడమే అతని ఆత్మహత్యకు కారణం అని చెబుతున్నారు.. రాజస్థాన్‌లోని బన్‌స్వారా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


దవడిమాల్ గ్రామానికి చెందిన వినోద్‌ వివాహానికి శుక్రవారం ఉదయం ముహూర్తంగా నిర్ణయించారు. గురువారం రాత్రి నుంచే అతని ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. పెళ్లి వేడుకలో డీజే ఏర్పాటు చేయాలనేది వినోద్ కోరిక. అయితే అందుకు పోలీసులు నిరాకరించారు. అనుమతి ఇవ్వలేదు. దీంతో గురువారం రాత్రంతా వినోద్ అసంతృప్తిగానే ఉన్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత వినోద్ ఒక్కడే బయటకు వెళ్లాడు. ఎంత సేపటికీ తిరిగి రాలేదు. 


దీంతో బంధువులందరూ వినోద్ కోసం గాలించారు. సమీపంలోని వేప చెట్టుకు వినోద్ ఉరేసుకుని కనిపించాడు. దీంతో షాకైన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. పోస్ట్‌మార్టమ్ తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అందించారు. డీజేకు అనుమతి ఇవ్వకపోవడం వల్లే వరుడు చనిపోయాడనే వాదనను పోలీసులు కొట్టిపారేశారు. దర్యాఫ్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. 

Updated Date - 2021-12-25T19:59:40+05:30 IST