Abn logo
Jul 29 2021 @ 23:09PM

విషజ్వరాల విజృంభణ

జ్వరంతో బాధపడుతున్న అరుణకుమారి

కుక్కునూరు మండలంలో పెరుగుతున్న బాధితులు

బెస్తగూడెంలో ఒకరి మృతి.. ఆందోళనలో ప్రజలు

కుక్కునూరు, జూలై 29 : కుక్కునూరు మండ లంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యం గా బెస్తగూడెం, ఇసుకపాడు గ్రామాల్లో వీటి బారి నపడిన వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోం ది. పరిస్థితి విషమించి పలువురు మృత్యువాత పడుతున్నారు. తాజాగా బెస్తగూడెంలో గుంటుప ల్లి సుజన(26) అనే మహిళ కొద్ది రోజులుగా జ్వ రంతో బాధపడుతోంది. ఖమ్మంలో చికిత్స పొందు తూ మృతి చెందినట్టు బంధువులు తెలిపారు. అలాగే అంబటి లక్ష్మి, అంబటి సింధు, దానబోయిన కృష్ణకుమారి, శ్రీరాముల అరుణకుమారి, శ్రీరాముల దీక్షశ్రీ, అంబటి కృష్ణార్జునరావుతో సహా మరికొందరు జ్వరాల బారినపడ్డారు. కొందరికి ప్లేట్‌లెట్స్‌ తగ్గడంతో భద్రాచలంలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల దామరచర్లకు చెందిన మానుపల్లి సాయిరామ్‌ అనే 14 ఏళ్ల బాలుడు విష జ్వరంతో బాధపడుతూ చనిపోయాడు. ఇసుకపాడులోనూ వారం రోజులు గిరిజనులు జ్వరాలతో అల్లాడిపోయారు. స్థానిక ఆర్‌ఎంపీల వద్ద చికిత్స పొందుతూ మరింత తీవ్రమైతే తెలంగాణలోని భద్రాచలం, ఖమ్మం తరలివెళ్తున్నారు. పెరుగుతున్న జ్వరాలపై ఆందోళన చెందుతున్నారు. తక్షణం అధికారులు స్పందించి గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.