జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-01-25T05:58:41+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చేపట్టిన జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ ఆదేశించారు.

జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి

 కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌

జగిత్యాల, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చేపట్టిన జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ ఆదేశించారు. సోమవారం పట్టణంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి సంబందిత అధికారులతో వీడియో కాన్ఫరె న్స్‌ నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్‌ రవి మాట్లాడారు. ప్రతీ ఇం టికి వెళ్తి జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలు సేకరించి కొవిడ్‌ పరీ క్షలు నిర్వహించి హోం ఐసోలేషన్‌ మెడికల్‌ కిట్లు పంపిణీ చేయా ల న్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2,24,184 ఇంటింటి ఫీవర్‌ సర్వే చేయగా కొవిడ్‌ లక్షణాలు ఉన్న 6,122 మందిని గుర్తించి వారికి హోమ్‌ ఐసోలే షన్‌కిట్లు అందించామన్నామన్నారు. ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు, అంగన్‌ వా డీ టీచర్లు, మున్సిపల్‌, స్వశక్తి మహిళా సంఘ సభ్యులు, రిసోర్స్‌ పర్సన్‌ లు సమన్వయంగా, బాధ్యతాయుతంగా సర్వేను సక్రమంగా నిర్వహిం చాలని ఆదేశించారు. కొవిడ్‌ రెండ డోస్‌, బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ను వే గవంతంగా చేయాలన్నారు. బూస్టర్‌ డోస్‌ను 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల వారికి వ్యాక్సినేషన్‌ గడువులోగా ఇవ్వాలని సూచించారు. వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన జిల్లాగా రూపుదిద్దాలని, అవస రం మేరకు ఆర్‌టీపీసీఆర్‌, ర్యాపిడ్‌ టెస్టులు ఎక్కువ చేయాలన్నారు.

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ గణతంత్ర వేడుకలు...

జిల్లాలో ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు కొవిడ్‌ నిబంధన లను పాటిస్తూ గణతంత్ర వేడుకలను నిర్వహించుకోవాలని కలెక్టర్‌  ఆ దేశించారు. ఈనెల 26వ తేదిన ఉదయం 10 గంటలకు జెండా వందనం కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దళిత బందు అమలుకు ప్రత్యేక క మిటీలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. టీఎస్‌ బీ పాస్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌ లేకుండా చూడాలన్నారు.. భవన నిర్మాణాలు ఇ చ్చిన అనుమతుల మేరకు జరుగుతున్నాయో లేదో.. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ జరపాలన్నారు. గ్రామ పంచాయతీల్లో డీపీఓ, అ ర్బన్‌ ప్రాంతాల్లో మున్సిపల్‌ కమిషనర్లు సానిటేషన్‌ సక్రమంగా జరిగే లా చూడాలన్నారు. వివిధ పథకాల ద్వారా మంజూరయిన రుణాల యూనిట్లను స్థాపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రైకార్‌ నుంచి రు ణాల మంజూరుకు సంబందించి ఎంపీడీఓల ద్వారా నివేదికలను స్వీ కరించాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ లత, ఇంచార్జీ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌, జగిత్యాల ఆర్డీఓ మాదరి పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T05:58:41+05:30 IST