ఫీవర్‌ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-01-22T04:23:06+05:30 IST

కరోనా నుంచి ప్రజలను కాపాడుకోవడానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫీవర్‌ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అధి కారులను ఆదేశించారు.శుక్రవారం తిర్యాణి మండలం గంభీరావుపేట గ్రామంలో నిర్వ హిస్తున్న సర్వేను ఆయన పరిశీలించారు.

ఫీవర్‌ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
తిర్యాణిలో సర్వేను పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

- కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

తిర్యాణి, జనవరి 21: కరోనా నుంచి ప్రజలను కాపాడుకోవడానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫీవర్‌ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అధి కారులను ఆదేశించారు.శుక్రవారం తిర్యాణి మండలం గంభీరావుపేట గ్రామంలో నిర్వ హిస్తున్న సర్వేను ఆయన పరిశీలించారు. ఈకార్యక్రమంలో ప్రతి ఇంటిని సందర్శించి పూర్తి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. తహసీల్దార్‌ మల్లికార్జున్‌, వైద్యాధికారి శ్యాం, వైద్యసిబ్బంది పాల్గొ న్నారు. అలాగే మంగి పంచాయతీలోని గుట్టగూడ, హాస్టల్‌గూడ, పాతగూడ గ్రామాల్లో వైద్యాధికారి విష్ణువర్ధన్‌, హెల్త్‌ ఎడ్యూకేటర్‌ రషీద్‌తో కలిసి ఇంటింటి సర్వే నిర్వహించారు.

సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్‌

కాగజ్‌నగర్‌ రూరల్‌: మండలంలో శుక్రవారం నిర్వ హించిన ఫీవర్‌ సర్వేను అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి పరిశీలించారు. నజ్రుల్‌నగర్‌ విలేజ్‌ నం.1, 2, భట్టుపల్లి, ఈసుగాం గ్రామాల్లో నిర్వహించిన సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండా లని అన్నారు. ప్రతిఒక్కరూ మాస్కులు దరించేలా గ్రామ సర్పంచ్‌లు, కార్యదర్శులు చర్యలు తీసుకోవాల న్నారు. ఎంపీడీవో సుశీల్‌రెడ్డి, ఏపీవో బుచ్చన్న తదిత రులు ఉన్నారు. అనంతరం నజ్రుల్‌నగర్‌ ప్రాంతంలోని పండ్ల తోటలను ఆయన పరిశీలించి అన్ని గ్రామాల్లో ఇదే విధంగా పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహిం చాలని అధికారులకు సూచించారు.

కెరమెరి: మండలంలోని అన్ని గ్రామ పంచాయ తీల్లో ఇంటింటి సర్వే కొనసాగుతున్నట్లు ఎంపీడీవో మహేందర్‌రెడ్డి తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి వైద్య సేవలు అందించడంతో పాటు కిట్లు అందజేస్తున్నట్లు తెలిపారు.  

రెబ్బెన: మండలంలోని పలుగ్రామాల్లో ఫీవర్‌ సర్వే నిర్వహించారు. ఈసందర్భంగా జ్వరంతో బాధపడు తున్న వారికి కరోనా కిట్స్‌ అందజేశారు. ఎంపీఈ సౌందర్య, జడ్పీటీసీ సంతోష్‌, ఎంపీడీవో సత్యనారా యణ, సర్పంచ్‌లు అహల్యాదేవి, సోమశేఖర్‌, వినోద, సుమలత, పోచమల్లు పాల్గొన్నారు. 

చింతలమానేపల్లి:మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం వైద్య సిబ్బంది ఇంటింటికి ఫీవర్‌ సర్వే నిర్వహించి జ్వరంతో బాధపడుతున్న వారికి కరోనా కిట్స్‌ అందజేశారు. 

పెంచికలపేట: మండల వ్యాప్తంగా శుక్రవారం డాక్టర్‌ ముస్తాఫా ఆధ్వర్యంలో ఫీవర్‌ సర్వే నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒమై క్రాన్‌ వైరస్‌వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు జాగ్ర త్తగా ఉండాలన్నారు. తహసీల్దార్‌ అనంతరాజ్‌, ఎంపీవో గంగాసింగ్‌, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. 

దహెగాం : మండలంలోని కుంచవెల్లి, కల్వాడ, హత్తిని గ్రామాల్లో కొనసాగుతున్న ఇంటింటికి జ్వరం సర్వేను శుక్రవారం ఎంపీడీవో సత్యనారాయణగౌడ్‌ పరిశీలించారు. జ్వరం బాధితులను గుర్తించి కిట్లను అందజేయాలని సూచించారు. 

బెజ్జూరు: మండలంలో శుక్రవారం డాక్టర్‌ రుషి ఆధ్వర్యంలో ఇంటింటి ఫీవర్‌ సర్వే నిర్వహించారు.

జైనూరు: మండలంలోని మార్లావాయి, జైనూరు తదితర గ్రామాల్లో వైదసిబ్బంది శుక్రవారం ఇంటింటికి ఆరోగ్య సర్వే నిర్వహించారు. ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్‌ వేసుకోవాలని మార్లవాయి సర్పంచ్‌ కనక ప్రతిభ వెంకటేష్‌ కోరారు. గ్రామ కార్యదర్శి మనోజ్‌, ఎఎన్‌ఎం హంస, ఐసిడిఎస్‌ టీచర్‌ కొడప వెత్తుబాయి, ఆశ వర్కర్‌ ఆడ చంద్రకళ, తదితరులు ఉన్నారు.

సిర్పూర్‌(యూ): మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం ఇంటింటికి తిరిగి జ్వర సర్వే చేపట్టారు. వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తు న్నారు. నేట్నూర్‌లో సర్పంచ్‌ ఆర్క హీరాబాయి , వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

వాంకిడి: మండలంలోని ఖమాన గ్రామంలో శుక్రవారం ఫీవర్‌సర్వే చేపట్టారు. ప్రతిఒక్కరు రెండవ డోసు వ్యాక్సిన్‌తీసుకొని కొవిడ్‌ నిబంధనలు పాటిం చాలని సూచించారు. అనంతరం అవసరమైన వారికి మెడికల్‌ కిట్‌ అందించారు. సర్పంచు పవన్‌, ఏఎన్‌ఎం పుష్పలత, కార్యదర్శిపోశం, ఆశా వర్కర్లు  పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T04:23:06+05:30 IST