సంగారెడ్డి జిల్లాలో ముగిసిన ఫీవర్‌ సర్వే

ABN , First Publish Date - 2022-01-24T05:03:34+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో ఫీవర్‌ సర్వే ముగిసింది. ఈ నెల 20న సాయంత్రం ప్రారంభమైన జ్వర సర్వే ఆదివారం సాయంత్రంతో ముగిసిందని వైద్యాధికారులు తెలిపారు. జిల్లాలో ఎన్ని కుటుంబాలను సర్వే చేశారు, ఎంత మందికి కొవిడ్‌ లక్షణాలున్నట్లు గుర్తించారు, ఎంత మందికి హోంఐసోలేషన్‌ కిట్లు పంపిణీ చేశారో అనే సమాచారం మాత్రం వెల్లడించడం లేదు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తీరు విమర్శలకు తావిస్తున్నది.

సంగారెడ్డి జిల్లాలో ముగిసిన ఫీవర్‌ సర్వే
సంగారెడ్డిలో ఫీవర్‌ సర్వే చేస్తున్న వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది

మూడురోజుల్లోనే పూర్తిచేసిన వైద్యఆరోగ్య శాఖ సిబ్బంది

సమాచారం వెల్లడించని జిల్లా అధికారులు


సంగారెడ్డి అర్బన్‌, జనవరి 23: సంగారెడ్డి జిల్లాలో ఫీవర్‌ సర్వే ముగిసింది. ఈ నెల 20న సాయంత్రం ప్రారంభమైన జ్వర సర్వే ఆదివారం సాయంత్రంతో ముగిసిందని వైద్యాధికారులు తెలిపారు. జిల్లాలో ఎన్ని కుటుంబాలను సర్వే చేశారు, ఎంత మందికి కొవిడ్‌ లక్షణాలున్నట్లు గుర్తించారు, ఎంత మందికి హోంఐసోలేషన్‌ కిట్లు పంపిణీ చేశారో అనే సమాచారం మాత్రం వెల్లడించడం లేదు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తీరు విమర్శలకు తావిస్తున్నది. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్‌ సర్వసభ్యసమావేశంలో తొలి రోజు టీనేజర్లకు తక్కువ సంఖ్యలో వ్యాక్సిన్‌ ఇవ్వడం విషయంలో ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ గాయత్రీదేవీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఫీవర్‌ సర్వే కూడా మొక్కుబడిగా సాగి, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదని అందుకే సర్వే వివరాలు బయటకు చెప్పకుండా గోప్యత పాటిస్తున్నట్లు తెలుస్తోంది. కీలకమైన వైద్య ఆరోగ్య శాఖకు జిల్లా ఇన్‌చార్జి అధికారి ఉండడంతోనే ఈ సమస్య తరుచూ ఉత్పన్నమవుతున్నట్లు తెలుస్తోంది. 


సిద్దిపేటలో కొనసాగుతున్న సర్వే

సిద్దిపేట టౌన్‌, జనవరి 23: ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫీవర్‌ సర్వే సిద్దిపేట జిల్లాలో కొనసాగుతోంది. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 981 టీమ్‌లు 35,969ఇళ్లను సందర్శించి సర్వే నిర్వహించాయి. తలనొప్పి, ఒళ్లు, నొప్పులు, జ్వరంతో బాధపడుతున్న 672 మందికి కరోనా కిట్లను అందజేశారు. జిల్లావ్యాప్తంగా ఆదివారం నాటికి 1,57,436 ఇళ్లను సందర్శించారు. 2,956మందికి లక్షణాలున్నట్లు గుర్తించి 2,872మందికి కరోనా కిట్లను అందజేసినట్లు అధికారులు తెలిపారు.


మెదక్‌ జిల్లాలో 1,778 మందికి లక్షణాలు

మెదక్‌ జిల్లాలో ఆదివారం 633 బృందాలు 27,139 ఇళ్లల్లో జ్వర సర్వే నిర్వహించాయి. 1,778 మంది జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. మూడు రోజుల్లో 1,04,710 ఇళ్లల్లో జ్వర సర్వే పూర్తి చేసి, 6,786 మందిని గుర్తించారు.

Updated Date - 2022-01-24T05:03:34+05:30 IST