ముమ్మరంగా జ్వర సర్వే

ABN , First Publish Date - 2022-01-22T05:18:01+05:30 IST

అశ్వారావుపేట మండలంలో శుక్రవారం ఇంటింటి జ్వర సర్వే కార్యక్రమం ప్రారంభమైంది. పాల్వంచ ఆర్డీవో స్వర్ణలత, తహసీల్దార్‌ చల్లా ప్రసాద్‌ తో పాటు వినాయకపురం,. గుమ్మడపల్లి పీహెచ్‌సీల వైద్యులు డా. రాంబాబు, డా. హరీష్‌ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా 66 బృందాలు సర్వేలో పాల్గొన్నాయి. తొలిరోజు 3,751 ఇళ్ల సర్వేను అధికారుల బృందం పూర్తిచేసింది. వీరిలో 101 మంది కొవిడ్‌ లక్షణాలు గుర్తించి వారికి కిట్‌లను అందజేశారు. బృం దంలో అంగన్‌వాడీ, ఐకేపీ, వైద్యఆరోగ్యశాఖ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

ముమ్మరంగా జ్వర సర్వే
దుమ్ముగూడెంలో జ్వర సర్వే నిర్వహిస్తున్న దృశ్యం

అశ్వారావుపేట, జనవరి 21: అశ్వారావుపేట మండలంలో శుక్రవారం ఇంటింటి జ్వర సర్వే కార్యక్రమం ప్రారంభమైంది. పాల్వంచ ఆర్డీవో స్వర్ణలత, తహసీల్దార్‌ చల్లా ప్రసాద్‌ తో పాటు వినాయకపురం,. గుమ్మడపల్లి పీహెచ్‌సీల వైద్యులు డా. రాంబాబు, డా. హరీష్‌ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా 66 బృందాలు సర్వేలో పాల్గొన్నాయి. తొలిరోజు 3,751 ఇళ్ల సర్వేను అధికారుల బృందం పూర్తిచేసింది. వీరిలో 101 మంది కొవిడ్‌ లక్షణాలు గుర్తించి వారికి కిట్‌లను అందజేశారు. బృం దంలో అంగన్‌వాడీ, ఐకేపీ, వైద్యఆరోగ్యశాఖ పంచాయతీ  సిబ్బంది పాల్గొన్నారు. 

రెండో డోస్‌ త్వరగతిన పూర్తి చేయాలి

కరకగూడెం, జనవరి 21: మండలంలోని ప్రజలకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ రెండో డోస్‌ త్వరితగతిన పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి జైసింగ్‌ తెలిపారు. శుక్రవారం మండలంలో వైద్యాధికారి పర్శియా నాయక్‌ ఆధ్వర్యంలో ఇంటింటికి జర్వే సర్వే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 15 నుంచి 17 సంవత్సరాల పిల్లలకు తప్పక కొవిడ్‌ వ్యాక్సిన్‌ పూర్తి చేయాలని.. హెల్త్‌ కేర్‌ వర్కర్స్‌, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌కు ఫ్రీకాసనరీ డోస్‌ పూర్తి చేయాలని తెలిపారు. సర్వేలో గుర్తించిన జ్వరం కేసులకు హోమ్‌ ఐసోలేషన్‌ కిట్స్‌ అందజేయాలని ఏడు రోజుల పాటు ఆ వ్యక్తులను పరిశీలిస్తుండాలన్నారు. ఐదు రోజుల తరువాత కూడ జ్వరం తగ్గని కేసులను వైద్యశాలకు తరలించి చికిత్స అం దించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి పర్శియా నాయక్‌ పాల్గొన్నారు.

ఇంటింటికి  జ్వరాల  సర్వే

అశ్వాపురం, జనవరి 21: మండలంలో కరోనా రోజురోజుకూ కోరలు చాస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇంటింటికి జ్వర సర్వే కార్యక్రమాన్ని సిబ్బంది ప్రారంభించారు. రోజు పంచాయతీల పరిధిలో 50 గృహాలలో సర్వే జరుగనుంది. ఈసందర్భంగా లక్షణాలు ఉన్నవారికి ఐసోలేషన్‌ కిట్‌ అందజేసి జాగ్రత్తలు సూచిస్తారు. సర్వే బృందంలో ఆశవర్కర్‌, అంగన్‌వాడీ టీచరు, కార్యదర్శి, డ్వాక్రాసభ్యురాలు సభ్యులుగా ఉంటారు. ప్రతీరోజు సర్వే రిపోర్ట్‌ను ఉన్నతాధికారులకు ఇవ్వనున్నారు. మొదటిరోజు మొండికుంటలో జరిగిన సర్వే కార్యక్రమంలో ఎంపీఈవో శ్రీనివాస్‌, పంచాయతీ కార్యదర్శి కె.సైదులు, ఆశావర్కర్‌ కృష్ణవేణి, అంగన్‌వాడీ టీచర్లు హంసవేణి, శైలజ పాల్గొన్నారు.

జ్వరపీడితులకు కొవిడ్‌ కిట్ల పంపిణీ

దుమ్ముగూడెం, జనవరి 21: మండల వ్యాప్తంగా నర సాపురం, దుమ్ముగూడెం, పర్ణశాల పీహెచ్‌సీల పరిధిలో శుక్రవారం 61 బృందాలు 3,150 గృహాల్లో ఫీవర్‌ సర్వే ని ర్వహించాయి. 235 మంది జ్వరపీడితులను గుర్తించి కొ విడ్‌ ఐసోలేషన్‌ కిట్లను అందజేశారు. క్రమం తప్పకుండా కిట్లలో మందులను వాడితే వ్యాధి నయమవుతుందని తెలి పారు. సర్వేలో ఎంపీడీవో చంద్రమౌళి, ఎంపీవో ముత్యాల రావు, డాక్టర్‌ చైతన్య, డాక్టర్‌ మణిదీప్‌, పంచాయతీ కార్యదర్శులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

అన్ని గ్రామాల్లో జ్వర సర్వే

 పినపాక, జనవరి 21: మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ముమ్మరంగా జ్వర సర్వే ప్రారంభమయింది. కరోనా ఉధృతి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో మండలాధికారులు ఇంటింటికీ జ్వర సర్వేకు శ్రీకారం చుట్టారు. పినపాక పీహెచ్‌సీ, జానంపేట పీహెచ్‌సీల పరిధిలో ఇప్పటికే ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖలతో జ్వర సర్వే బృందాలను ఏర్పాటు చేశారు. ఇంటింటికీ సర్వేలో భాగంగా శుక్రవారం తోగ్గుడెం గ్రామంలో తహసీల్దార్‌ విక్రమ్‌కుమార్‌, పినపాక ప్రభుత్వాసుపత్రి మెడికల్‌ ఆఫీసర్‌ బి.శివకుమార్‌ల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా ఫీవర్‌ సర్వే బృందాలకు సహకరించాలని కోరారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకోవాలని, రెండు డోసులు తీసుకుని తొమ్మిది నెలలు దాటినవారు బూస్టర్‌ డోసు తీసుకోవాలని సూచించారు. జ్వర సర్వే ద్వారా బాధితులకు పరీక్షలు నిర్వహించి, నివేదికల ఆధారంగా తగిన వైద్యం అందించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.



Updated Date - 2022-01-22T05:18:01+05:30 IST